Friday, March 13, 2026

 బీసీలకే సింహాభాగం … సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు

- Advertisement -

 బీసీలకే సింహాభాగం
బడ్జెట్ కేటాయింపులపై మంత్రి సవిత
 సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు

Minister Savita on budget allocations, lion’s share goes to BCs
అమరావతి :
బీసీల అభ్యున్నతి పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది మరోసారి రుజువైందని, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వెనుకబడిన వర్గాల సంక్షేమానికి చరిత్రలో కనీవినీ ఎరుగని కేటాయింపులు చేశారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆనందం వ్యక్తంచేశారు. మూడు కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్లోనూ నిధుల కేటాయింపులు పెంచుకుంటూ వెళుతున్నామన్నారు. నూతన బడ్జెట్ లో ఆదరణ 3.0 పథకానికి మరో రూ.1000 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తంచేశారు. 2026-27 బడ్జెట్ లో రూ.51,021 లక్షల కోట్లు  బీసీ సంక్షేమానికి కేటాయించినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి పయ్యావులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు. 2026-27 బడ్జెట్  అన్ని వర్గాల వారికి అనుకూలమైనదన్నారు. ముఖ్యంగా బీసీల ఉన్నతికి బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. 2024-25 బడ్జెట్ లో రూ.39,007 కోట్లు, 2025-26 బడ్జెట్ 47,456 కోట్లు,  2026-27 బడ్జెట్లో 51,021 కోట్లు కేటాయించారన్నారు. అందులో ఈడబ్ల్యూఎస్ సంక్షేమానికి రూ.10,669 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. 2025-26లో రూ.10,614 కోట్లు, 2024-25లో రూ.10,273.80 కోట్లు కేటాయించామన్నారు.  నూతన బడ్జెట్‌లోనూ ఆదరణ 3.0 పథకానికి మరో రూ.1000 కోట్లు, చేనేతలకు, సెల్లూన్లకు ఉచిత విద్యుత్ కోసం రూ.150 కోట్లు, రూ.50 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. ఇలా ఏటా బీసీ సంక్షేమానికి నిధులు కూటమి ప్రభుత్వం కేటాయింపులు పెంచుతూ వస్తోందన్నారు. చరిత్రలో ఎరుగని విధంగా, సింహాభాగం నిధులు బీసీల సంక్షేమానికి కేటాయించామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఇటువంటి కేటాయింపులు చేయలేదన్నారు. రాయలసీమ ను గ్లోబల్ హార్టీ కల్చర్ గా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం రూ.30 వేల కోట్లు కేటాయిస్తోందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా బడ్జెట్ ను రూపకల్పన చేశామన్నారు. వ్యవసాయానికి, పారిశ్రామిక రంగానికి కూడా ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ లో నిధులు కేటాయించామన్నారు, బీసీల పట్ల కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. సీఎం చంద్రబాబుకు, ఆర్థిక మంత్రి పయ్యావులకు మంత్రి సవితకు ఆ ప్రకటనలో ధన్యవాదాలు తెలియజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్