- Advertisement -
ఉపాధి హామీ పనులపై మంత్రి సీతక్క సమీక్ష
Minister Seetha's review of employment guarantee works
హైదరాబాద్
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై డీఆర్డీవో లతో సచివాలయం లో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే అయిదు మాసాల్లో చేయాల్సిన పనులపై సమీక్ష చేసారు. నిర్దేశించుకున్న గడువు లోపు పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. మార్చి లోపు ఉపాధి హామీ పనుల కోసం రూ. 1372 కోట్ల నిధులు వచ్చాయి. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన పనులపై మంత్రి సీతక్క మార్గ నిర్దేశం చేసారు. మహిళలకు ఉపాధి భరోసా, పంట పొలాలకు బాటలు, పండ్ల తోటల పెంపకం, ఇంకుడు గుంతలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, స్వచ్చ భారత్ మిషన్ కోసం ఉపాధి నిధులు వెచ్చించేలా క్షేత్రస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు ఇచ్చారు
- Advertisement -