- Advertisement -
గిరిజన విద్యార్దులకు లాప్ టాపులు బహుకరించిన మంత్రి సీతక్క
Minister Sitakka presented laptops to tribal students
హైదరాబాద్
బంజారాహిల్స్ లోని కొమరం భీమ్ ఆదివాసి భవన్లో గిరిజన సంక్షేమ శాఖపై విసృత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క హజరయ్యారు. ముందుగా మంత్రి కొమరం భీం విగ్రహానికి నివాళులర్పించి సమీక్ష సమావేశాన్ని ప్రారంభించారు.బ ఈ సమావేశానికి జీసీసీ చైర్మన్ కొట్నక్ తిరుపతి, గిరిజన శాఖ సెక్రెటరీ శరత్, ఐటిడిఏ పీవోలు, డిడిలు , గిరిజన పాఠశాలలు, గురుకులాల ప్రిన్సిపల్స్, వార్టెన్స్, ఇతర అధికారులు హజరయ్యారు. మంత్రి గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గిరిజన గురుకులాల్లో విద్యార్థుల కోసం హెల్త్ మానిటరింగ్ యాప్ ను ప్రారంభించారు. దీంతో గిరిజన విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది.
మంత్రి మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ మొత్తం ఇక్కడ సమావేశం కావటం అభినందనీయం. మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక లక్షాన్ని నిర్దేశించుకునేందుకు ఇక్కడ సమావేశమయ్యాము. ఫలితాలను మెరుగుపరుచుకునేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుంది. నేను ఏ శాఖలో ఉన్నా నా మనసు గిరిజన సంక్షేమం మీద ఉంటుందని అన్నారు. నా ప్రాణం ఆదివాసి, గిరిజనులు, చెంచుల గురించి కొట్టుకుంటుంది . వారి సమస్యలను తెలుసుకునేందుకు అచ్చంపేట వంటి ప్రాంతాలకు వెళుతూ ఉంటా . సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న టీచర్ల పదోన్నతులు కల్పించారు.. బదిలీల ప్రక్రియను పూర్తి చేశారు. 5000 మంది ఆశ్రమ పాఠశాల టీచర్లకు ప్రయోజనం జరిగింది. గత ప్రభుత్వం అప్పుల వల్ల గంటకు మూడు కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఎన్నో ఆర్థిక సమస్యలు వున్నా..మా ప్రభుత్వం ఉద్యోగులకు, విద్యార్థులకు మేలు చేస్తోంది. ప్రభుత్వానికి ప్రజలకు ఉద్యోగులు, టీచర్లు వారధులు . టీచర్లు మనసుపెట్టి పని చేయాలి. కష్టాన్ని ఇష్టంగా చేసుకుని పని చేయాలి. అప్పుడే పనిలో సంతృప్తి కలుగుతుంది. విద్యార్థులను సొంత పిల్లల్లాగా చూసుకోవాలి. సొంత పిల్లల్లాగానే వారిని తీర్చిదిద్దాలి. అందరిలో కెల్లా గిరిజనవిద్యార్థులను ముందంజలో నిలిపేలా పనిచేయాలని అన్నారు.
నాది కూడా హాస్టల్ జీవితమే చిన్నప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. హాస్టల్ పిల్లలంటే చులకన భావం ఉంటుంది. మనల్ని అవహేళన చేసేవారికి గుణపాఠం చెప్పేలా కసితో కష్టపడాలి..అప్పుడే ఎదుగుతాం. గుడాలు, తండాలు, పెంటల నుంచి వచ్చిన పిల్లలు జాతీయ, అంతర్జాతీయ క్రీడ పోటీల్లో పథకాలు సాధిస్తున్నారని అన్నారు.
గిరిజన విద్యార్థులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తాము. మంచిగా పని చేసిన అధికారులను దేవుడు లాగా కొలుస్తారు . ఎక్కడైతే విద్యా వ్యవస్థ సరిగ్గా లేదో అక్కడే అద్భుతాలు సృష్టించగలగాలని అన్నారు.
నాసిరకం వస్తువుల కొనుగోలు పై విచారణ జరిపిస్తాం. హాస్టల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. ఐటీడీఏ పనితనాన్ని మెరుగుపరచాలి. ఐటీడీఏ పీవోలు చాలా పవర్ఫుల్ . కాలానికి అనుగుణంగా ప్రజల అవసరాలను తీర్చే విధంగా పనిచేయాలని అన్నారు.
సమావేశంలో భాగంగా మంత్రి ఉన్నత విద్యా సంస్థల్లో సీట్ల సంపాదించిన పలువురు విద్యార్థులకు ల్యాప్ టాప్ లు బహుకరించారు.
- Advertisement -