- Advertisement -
గాంధీచౌక్ గణేషుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు
Minister Sridhar Babu conducted special pooja at Ganesh at Gandhi Chowk
మంథని
మంథని పట్టణంలోని గాంధీ చౌక్ లో గణేష్ నవరాత్రుల్లో భాగంగా నెలకొల్పిన గణనాథుని వద్దకు తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు విచ్చేసి శనివారం దర్శించుకున్నారు. అనంతరం ఏకాదశి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కి వేద పండితులు ఆశీర్వచనం అందించారు. మంథని నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ గణనాథుని మంత్రి శ్రీధర్ బాబు వేడుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబును గాంధీ చౌక్ ఉత్సవ సమితి సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గాంధీ చౌక్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కొమురోజు చంద్రమోహన్, కార్యదర్శి పెండ్యాల రామ్ కుమార్, ఉపాధ్యక్షుడు ఓల్లాల అశోక్, ఆర్థిక కార్యదర్శి సిరిపురం రమేష్,మంథని మాజీ సర్పంచ్ ఓడ్నాల శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమా సురేష్ రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య,కౌన్సిలర్ వికే రవి, మాజీ ఎంపీటీసీ ఓడ్నాల ప్రవళ్లిక, వీధి పెద్దలు సిరిపురం వెంకటేశం, రేపాల ఉమాదేవి, కొమురోజు శ్రీనివాస్, కజ్జం శంకర్, కొమురోజు వేణు, రేపాల రమేష్, మధూకర్, సుమన్, ఒల్లాల వెంకన్న, కొమురోజు సురేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, మాజీ ఎంపీపీ కొండా శంకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
- Advertisement -