ట్రాఫిక్ జామ్ ను చక్కదిద్దిన మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

ట్రాఫిక్ జామ్ ను చక్కదిద్దిన మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridhar Babu fixed the traffic jam

హైదరాబాద్
ట్యాంక్ బండ్ వైపు నుంచి వస్తున్న కారు అంబేద్కర్ కూడలి వద్ద అదుపు తప్పి    ఫుట్ పాత్ పైకి దూసుకుపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.  రాత్రి 9 గంటల సమయంలో ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్యార్టర్సు నుంచి యు టర్న్ తీసుకుని సెక్రటేరియట్ వైపు వెళ్తున్న మంత్రి శ్రీధర్ బాబు వాహనం దిగి స్వయంగా ట్రాఫిక్ ను చక్కదిద్దారు.  ఆయన సెక్యూరిటీ సిబ్బంది కారును అక్కడి నుంచి పక్కకు జరిపారు.  ఈ లోగా శ్రీధర్ బాబు వ్యక్తిగత సహాయకులు ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు దెబ్బతిన్న కారును దూరంగా తీసుకెళ్లి ట్రాఫిక్ ను క్లియర్ చేసారు.  దాదాపు పది నిమిషాల సేపు అక్కడే ఉన్న శ్రీధర్ బాబు ట్రాఫిక్ అవాంతరం తొలగిన తర్వాత బయలు దేరి వెళ్లారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular