ఎన్నో ఏండ్లుగా పేరుకు పోయిన డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం చూపిన మంత్రి శ్రీధర్ బాబు
Minister Sridhar Babu has solved the problem of drainage which been many years
-జేసీబీ సహాయంతో పూడికతీత పనులు ప్రారంభం
-హర్షం వ్యక్తం చేస్తున్న కాకర్లపల్లి గ్రామ ప్రజలు
మంథని
మంథని మండలం కాకర్లపల్లి గ్రామంలో ఎన్నో ఏండ్లుగా డ్రైనేజ్ సమస్య వల్ల వర్ష కాలంలో ఇళ్లలోనికి నీళ్లు వచ్చి గ్రామ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాకర్లపల్లి గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకుల విజ్ఞప్తి మేరకు ఐటీ పరిశ్రామల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ తీసుకొని ఎన్నో ఏండ్లుగా పేరుకు పోయిన డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం చూపారు.
ఈ డ్రైనేజి సమస్య పరిష్కారానికి మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు,కాంట్రాక్టర్ ముందుకు వచ్చి బుధవారం డ్రైనేజ్ ని జేసీబీ సహాయంతో పూడికతీత పనులను ప్రారంబించారు.ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసిన మంత్రి శ్రీధర్ బాబుకు గ్రామ ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మెండే రాజయ్య, కనవేన ఓదెలు, భాస్కర్ల శంకరయ్య, తన్నీరు లక్ష్మణ్, కనవేన కుమార్,ఆకుల మధుకర్, ఈసంపల్లి మహేందర్, ఎలగందుల రవి, ఎలగందుల వెంకటేష్, మంథని అశోక్, గుంటుకు గణేష్, కల్లకుర్తి మహేష్ తదితరులు పాల్గొన్నారు.