Thursday, February 12, 2026

 స్పోర్ట్స్ హ్యాకథాన్ పోస్టర్ ను అవిష్కరించిన మంత్రి శ్రీహరి

- Advertisement -

 స్పోర్ట్స్ హ్యాకథాన్ పోస్టర్ ను అవిష్కరించిన మంత్రి శ్రీహరి
హైదరాబాద్

Minister Srihari unveils sports hackathon poster
క్రీడలు,సాంకేతికతతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అతిపెద్ద స్పోర్ట్స్ హ్యాకథాన్ కు హైదరాబాద్ వేదిక కాబోతోందని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. మార్చి 28,29 తేదీల్లో గచ్చిబౌలి స్టేడియం వేదికగా 24 గంటల పాటు నిరంతరాయంగా ఈ కార్యక్రమం జరగనుందని మంత్రి వెల్లడించారు..స్పోర్ట్స్ హ్యాకథాన్ పోస్టర్ ను మంత్రి అవిష్కరించారు…లైవ్‌లో ఆటలు ఆడుతునే సమస్యలను గుర్తించడానికి టెక్నాలజీతో ఉపయోడపడుతుందన్నారు…10,000 మంది ఇన్నోవేటర్లతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా స్పోర్ట్స్ హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. సాధారణంగా హ్యాకథాన్‌లు నాలుగు గోడల మధ్య కంప్యూటర్ల ముందు జరుగుతాయి. ఈ హ్యాకథాన్ స్టేడియంలో ప్లేయర్స్ లైవ్‌లో క్రికెట్, స్విమ్మింగ్, కబడ్డీ వంటి దాదాపు 25 రకాల క్రీడలు ఆడుతుండగా.. ఇన్నోవేటర్లు ఆ ఆటల్లో ఎదురయ్యే సమస్యలను గమనించి వాటికి అక్కడికక్కడే సాంకేతిక పరిష్కారాలను ఆలోచిస్తారు. గతంలో కెనడా వంటి దేశాల్లో క్లోజ్డ్ లెవల్‌లో ఇలాంటి ప్రయత్నాలు జరిగినా, స్టేడియంలో లైవ్ గేమ్స్‌తో ఇంత భారీ ఎత్తున జరగడం ఇదే తొలిసారి అని మంత్రి తెలిపారు. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి సుమారు 10,000 మంది విద్యార్థులు, ఇన్నోవేటర్లను ఎంపిక చేయనున్నారు. స్థానిక ఆవిష్కర్తలతో పాటు అంతర్జాతీయ స్థాయి నిపుణులు కూడా ఇందులో పాల్గొనున్నారు. దాదాపు 2,000 నుంచి 2,500 కొత్త ఆవిష్కరణలు ఈ హ్యాకథాన్ ద్వారా కొత్త వారు వస్తారని తెలిపారు.. ఇందులో కనీసం 15% విజయవంతమైనా క్రీడా రంగానికి అది గొప్ప మేలు చేస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేవలం టెక్నాలజీ మాత్రమే కాకుండా, గతంలో ఆయా క్రీడల్లో రాణించిన సీనియర్ ప్లేయర్స్ కూడా పాల్గొంటారు. వారు తమ కెరీర్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను, సమస్యలను ఇన్నోవేటర్లతో పంచుకుంటారు. తద్వారా ప్రాక్టికల్‌గా పనికొచ్చే పరిష్కారాలు రూపొందుతాయని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి వినూత్న కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ తరపున ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తామని, గచ్చిబౌలి వేదికగా సరికొత్త టెక్నాలజీ ప్రపంచానికి పరిచయం కావాలని ఆయన ఆకాంక్షించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్