Sunday, September 8, 2024

యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రతినిధులతో మంత్రి బృందం

- Advertisement -

మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమెరికా పర్యటన 3వ రోజు

Ministerial delegation with representatives of the US Department of Agriculture
Ministerial delegation with representatives of the US Department of Agriculture

వాషింగ్టన్ డీసీ:  పరిశోధన రంగంలో యూఎస్డీయే  (యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్) సహకారం ఆశిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఐటీ, ఫార్మ్ ఎకనామిక్స్, సీడ్ టెక్నాలజీ, పోస్ట్ హార్వెస్ట్ మ్యానేజ్మెంట్, మార్కెటింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, న్యుయర్ ప్లాంటింగ్ టెక్ తదితర రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాల గురించి మూడో రోజు పర్యటనలో USDA ప్రతినిధులతో మంత్రి బృందం చర్చలు  జరిపింది.

మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగం అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నదే మా ఆకాంక్ష. భావితరాలు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా చూసుకునే బాధ్యత మనపై ఉన్నదని అన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తొమ్మిదేళ్లలో తెలంగాణ వ్యవసాయం గణనీయమైన పురోగతి సాధించింది. ఉపాధి కల్పనలో వ్యవసాయ, దాని అనుబంధరంగాల పాత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసు .. అందుకే వ్యవసాయ అనుకూల విధానాలకు పెద్దపీట వేసి రైతులను ప్రోత్సహిస్తున్నారు. సమైక్య పాలనలో సంక్షోభంలో ఉన్న వ్యవసాయం తెలంగాణ రాష్ట్రంలో సంబరంగా మారింది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు పథకం ప్రారంభించి రైతులకు పంట పెట్టుబడి అందిస్తున్నారు .. రైతుభీమాతో వ్యవసాయ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలు పూడిక తీసి చెరువులకు మళ్ళీ జలకళ సంతరించుకునేలా చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం, పాలామూరు రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సాగునీటి గోస తీర్చారని అన్నారు.

Ministerial delegation with representatives of the US Department of Agriculture
Ministerial delegation with representatives of the US Department of Agriculture

వ్యవసాయ రంగానికి ఉచితంగా 24 గంటల విద్యుత్ ఉచితంగా అందిస్తున్నారు.. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఇప్పడు తెలంగాణలో నీళ్ళు, కరెంట్ పుష్కలంగా ఉండటం, సాగు విస్తీర్ణం పెరగడం, ఉపాధి అవకాశాలు లభిస్తుండడంతో వలసలు ఆగిపోయాయి.. వలస వెళ్ళినవారు తిరిగి గ్రామాలకు వాపస్ వస్తున్నారు. వరిధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్ని దాటిపోయింది. భారతదేశంలో ఉన్న వాతావరణ పరిస్థితులు ఏడాది పొడవునా అన్ని కాలాల్లోనూ పంటలు పండించడానికి అనువుగా ఉంటుంది

భారతదేశంలో వనరులతో మన దేశంలో ఉన్న 140 కోట్ల జనాభాకు ఆహారాన్ని అందించగలం .. అలాగే విదేశాలకు కూడా ఎగుమతి చేయగలగాలి. నాణ్యతతో కూడిన పౌష్టికాహారాన్ని మనం భావి పౌరులకు అందించాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్