బద్వేల్ లో రాష్ట్ర మంత్రులు సబిత ఫరూక్
Ministers of State in Badwel Sabita Farooq
బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త రితేష్ రెడ్డిలతో మంతనాలు
మంత్రులను కలిసిన కూటమి నాయకులు వివిధ శాఖల అధికారులు
బద్వేలు
బద్వేల్ లో రాష్ట్ర మంత్రులు సబితా ఫరూక్ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగే ఒక్క కార్యక్రమానికి వెళుతూ మార్గమధ్యంలో బద్వేల్ లో మంత్రులు కాసేపు ఉన్నారు వారిని కూటమి నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ రితేష్ రెడ్డితో వారు స్థానిక తెలుగుదేశం పార్టీ రాజకీయాల గురించి సమస్యల గురించి మాట్లాడడం జరిగింది మంత్రులు పార్టీ కార్యాలయానికి వస్తున్న విషయం తెలిసి కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు పార్టీ కార్యాలయంలో నాయకులు అధికారుల తో కలిసి మంత్రులు అల్పాహారం తీసుకున్నారు కూటమి నాయకుడు బిజెపి అభ్యర్థి బొజ్జ రోశన్న బద్వేల్ మున్సిపాలిటీ టిడిపి అధ్యక్షుడు వెంగళరెడ్డి పార్టీ నాయకులు బిగ్ బాస్ నాగభూషణం పలువురు నాయకులు మంత్రుల ను కలిసిన వారిలో ఉన్నారు మంత్రులకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు ఇదే సందర్భంగా మంత్రులకు బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి మున్సిపాలిటీలో చేపట్టే అభివృద్ధి పనుల గురించి వివరించి వినతి పత్రం ఇచ్చారు అలాగే బద్వేలు తాసిల్దార్ ఉదయ భాస్కర్ రాజు బద్వేలు పట్టణ గ్రామీణ పోలీస్ సిఐలు ఎస్సైలు మంత్రులను కలిశారు