- Advertisement -
ఇందిరా మహిళా శక్తి మేళాను సందర్శించిన మంత్రులు
Ministers visited Indira Mahila Shakti Mela
వరంగల్
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ఏడాది ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి మేళాను అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ , గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు సందర్శించారు.
మంత్రి సురేఖ స్టాళ్ళలో ఏర్పాటు చేసిన వస్తువులను పరిశీలించి, నిర్వాహకులతో ఆయా ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. నిర్వాహకుల కోరిక మేరకు చేతికి మెహందీ పెట్టించుకున్నారు. పలు ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా వరంగల్ ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక మంత్రి కొండా సురేఖ గారికి చీరను బహూకరించి, తమ మధ్య వున్న ఆప్యాయతను చాటారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, స్థానిక కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



