- Advertisement -
శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న మంత్రులు
Ministers who visited Srikalahasteeshwar
శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞాన ప్రసూనాంబ దేవి అమ్మవారిని తిరుపతి జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రులకు ఆలయ మర్యాదలతో అర్చకులు, ఆలయ కార్య నిర్వహణాధికారి స్వాగతం పలికారు. మంత్రులు స్వామి వారిని, అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వారికి దత్తాత్రేయ స్వామి వద్ద వేద పండితులు, ఆశీర్వచనాలు పలికారు. ఆలయ ఈ.ఓ శేష వస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంత్రులు ఉచిత భోజన శాలలో భక్తులకు అన్నం వడ్డించారు. ఆహార ఏర్పాట్లపై మంత్రులు ఆరా తీసి, సంతృప్తి వ్యక్తం చేశారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా పలు శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. అధికారులకు మంత్రులు దిశా నిర్దేశం చేశారు.
- Advertisement -