- Advertisement -
హైదరాబాద్, ఆగస్టు 23: హైదరాబాద్ పాతబస్తీలో తుపాకీ పేలుడు కలకలం రేపింది. ఓ కానిస్టేబుల్ చేతిలో తుపాకీ మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి చెందాడు. పాతబస్తీ హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో భూపతి శ్రీకాంత్ అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రాత్రి విధులు ముగించుకున్న శ్రీకాంత్.. పడుకునే సమయంలో చేతిలోని తుపాకీ ప్రమదవశాత్తు పేలింది. ఈ ఘటనలో శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మడుగులో పడిఉన్న శ్రీకాంత్‌ను గమనించిన తోటి సిబ్బంది వెంటనే అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీకాంత్ కన్నుమూశాడు.
- Advertisement -