Monday, December 23, 2024

అధికారుల తప్పు మీద తప్పు…

- Advertisement -

అధికారుల తప్పు మీద తప్పు…

Mistake after mistake by officials...

అధికారుల తప్పు మీద తప్పు…
ఇంకా ఎన్నాళ్లు
విజయవాడ, సెప్టెంబర్ 6 (న్యూస్ పల్స్)
ప్పు మీద తప్పు… మళ్లీ మళ్లీ అదే తప్పు… ప్రభుత్వాన్ని మెప్పించలేకపోతున్నారా? గత ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని మరక చెరుపుకోలేకపోతున్నారా? వీఆర్‌లో పెట్టిన కొందరు పోలీసు అధికారులపై మళ్లీ మళ్లీ ప్రభుత్వానికి ఫిర్యాదులు వెలుతుండటం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసు ఉన్నతాధికారుల బదిలీల్లో కొందరు ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టింది. సహజంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతైనా బదిలీలు చేస్తుంది. ఆ సమయంలో కొందరికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెడుతుంది. ఐతే చంద్రబాబు నాలుగోసారి సీఎం అయ్యాక గతంలో ఎప్పుడూ లేనట్లు ఓ 16 మంది ఐపీఎస్‌లకు వెరైటీ శిక్ష వేశారు.వీరంతా వెయిటింగ్‌లో ఉన్నప్పటికీ ప్రతిరోజూ డీజీపీ ఆఫీసుకు వచ్చి కూర్చోవాలని మెమో జారీ చేశారు. ఇలా మెమో అందుకున్న వారిలో కొందరు డీజీపీ ఆఫీసుకు వస్తుండగా, మరికొందరు ఏం జరుగుతుందో.. జరగనీ అన్నట్లు ఆఫీసుకు రావడం లేదని చెబుతున్నారు. ఐతే తాజాగా విజయవాడ వరదల్లో సహాయక చర్యల నిమిత్తం ఈ 16 మందిలో కొందరికి బందోబస్తు డ్యూటీలు వేశారు. ప్రభుత్వ సూచనల ప్రకారం ఆ అధికారులు తమకు అప్పగించిన బాధ్యతల్లో చేరినా, సక్రమంగా పని చేయలేదని మళ్లీ ఆరోపణలు ఎదుర్కోవడమే ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతీసేలా… ఉద్దేశ పూర్వకంగానే ఆ అధికారులు సహాయక చర్యలు ఆటంకం కలిగేలా వ్యహరించారని ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై సీఎం చంద్రబాబు కూడా సీరియస్‌గా ఉన్నారని అంటున్నారు. వరద తగ్గగానే ఈ అధికారులపై చర్యలు ఉంటాయని సీఎంవో వర్గాల సమచారం.విజయవాడ వరదల్లో బందోబస్తు నిమిత్తం వీఆర్‌లో ఉన్న చాలా మంది పోలీసులకు బాధ్యతలు అప్పగించారు. ఇందులో నలుగురు ఐపీఎస్‌లు, ఇద్దరు డీఎస్పీలపై ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు అంతా ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఆరుగురు అధికారులు వరద సహాయక చర్యల్లో సరిగా పనిచేయలేదని, వారి ప్రవర్తన చూస్తే ఉద్దేశపూర్వకంగానే సహాయ నిరాకరణ చేశారని అంటున్నారు. బాధితుల ఆకలి తీర్చేందుకు ఎంతో చెమటోడ్చి ఆహారాన్ని తెప్పించినా ఆరుగురు పోలీసుల వల్ల సకాలంలో అన్నం ప్యాకెట్లను బాధితులకు అందజేయలేకపోయామని కొందరు మంత్రులు సీఎం చంద్రబాబుకు లిఖిత పూర్వకంగా సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. మంత్రుల నుంచి సమాచారం తెలుసుకున్న సీఎం… ఆ అధికారులపై సీరియస్‌ అయినట్లు చెబుతున్నారు. పని చేయడం ఇష్టం లేకపోతే వెళ్లిపోవాలని, కావాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఎదుర్కొవాల్సివస్తుందని సీఎం హెచ్చరించినట్లు తెలుస్తోంది.గత ప్రభుత్వంలో వివిధ ఆరోపణలు ఎదుర్కొన్న చాలా మంది పోలీసులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా ప్రభుత్వం వీఆర్‌లో పెట్టింది. సహజంగా వీఆర్‌లో ఉన్న అధికారులు మళ్లీ పోస్టింగ్‌ వచ్చేవరకు ఇళ్లకే పరిమితమవుతుంటారు. ఐపీఎస్‌లు డీజీపీ ఆఫీసుల్లోనూ.. డీఎస్పీ ర్యాంకు అధికారుల వరకు డీఐజీ ఆఫీసులోనూ రిపోర్టు చేస్తుండాలి.. తమ సుపీరియర్‌ ఆఫీసర్‌ చెప్పే డ్యూటీలకు అటెండ్‌ కావాలి. కానీ, పోస్టింగ్‌లు లేనివారికి ఏ పని ఉండకపోవడంతో ఇళ్లలోనే ఉంటారు. పిలిచినప్పుడు వస్తుంటారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వీఆర్‌లో పెట్టిన అధికారుల్లో 16 మందిపై ప్రత్యేకంగా నిఘా వేసింది. వీరికి గత ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని, వివిధ కేసుల్లో దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారనే సందేహంతో రోజూ డీజీపీ ఆఫీసుకు రావాలని మెమో జారీచేసింది. దీన్ని జీర్ణించుకోలేని కొందరు సెలవులు పెట్టేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు చెబుతున్నారు.ఇక అధికారుల సెలవులపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలోనే వరదలు రావడం, విజయవాడ అతలాకుతలమవడంతో ఆ 16 మంది లిస్టులో పేర్లు ఉన్న నలుగురికి డ్యూటీలు వేశారు. యావత్ ప్రభుత్వ యంత్రాంగం రెండు రోజుల పాటు నిద్రాహారాలు మాని వరద సహాయ చర్యల్లో పాల్గొంటే… నలుగురు పోలీసు అధికారులు మాత్రం అందుబాటులో లేకపోవడం, ఉన్న సమయంలో సరిగా స్పందించక ఇబ్బంది పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్