- Advertisement -
మునిసిపల్ భేటీలో పాల్గోన్న ఎమ్మెల్యే అఖిలప్రియ
MLA Akhilapriya who participated in the municipal meeting
ఆళ్లగడ్డ
ఆళ్లగడ్డ మున్సిపల్ సమావేశ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గోన్నారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ మున్సిపల్ సమావేశం అంటే ప్రజలందరికీ ఉపయోగపడేది కనుక ప్రతి ఒక కౌన్సిలర్ మున్సిపల్ సమావేశానికి హాజరు కావాలి. వైసిపి కౌన్సిలర్లు ఎందుకు గెలిచారో వారికె అర్థం కావడం లేదు ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటే సమావేశానికి హాజరు కావాలి కదా అని అన్నారు.
వైసీపీ నాయకుడు ఎవరో చెబుతున్నారు అంట ఎమ్మెల్యే వస్తే మున్సిపల్ సమావేశానికి వెళ్లొద్దని. రాకుంటే నాకేమీ పోయేదేమీ లేదు. నేను చేసేది నేను చేస్తాను. ప్రజల్లో మొహం కూడా చూపించుకో లేకుండా తిరుగుతారని అన్నారు.
మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లకి ఏ సమస్య ఉన్న నాతో చెప్పుకోమని కచ్చితంగా సంబంధిత మంత్రులతో మాట్లాడి చేపిస్తానని ప్రజలెవరు ఇబ్బంది పడకుండా చూసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఆళ్లగడ్డ పట్టణంలోని రెండు స్టేడియంలను విజిట్ చేసాను. షాప్ చైర్మన్ రవి నాయుడు ఐదు కోట్ల నిధులతో ఈ రెండు స్టేడియాలను డెవలప్మెంట్ చేయాలని కమిషనర్ కు చెప్పారు.
టిట్కో గృహాలు చాలా వరకు దెబ్బ తిన్నాయి. ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా నేను వెళ్లి చూసాను. వర్షాకాలంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వాటిని సరిచేసి టిట్కో గృహాల్లో కూడా కొన్ని గృహాలు మిగిలి ఉన్నాయి. వాటిని ప్రజలకు చేరవేసేలాగా చూస్తానని హామీ ఇచ్చారు.
బీసీ కార్పొరేషన్ లోన్స్ ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసింది. ఆర్హులైనవారు ఈ లోన్ కి అప్లై చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే సూచించారు.
- Advertisement -