రోడ్ల మరమత్తు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం,:
తాడేపల్లిగూడెం నియోజకవర్గం స్థానిక తాడేపల్లిగూడెం-తణుకు ప్రధాన రహదారిపై మున్సిపల్ అధికారులతో హుటాహుటిన రోడ్డు మరమ్మత్తుల పనులు చేస్తుండగా మ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
స్వయంగా అక్కడకు విచ్చేసి దగ్గరుండి పర్యవేక్షించారు.అనంతరం జనసేన నాయకులు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశి అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం పట్టణం పోలీస్ ఐలాండ్ సెంటర్, తణుకు రోడ్డులో ఏర్పడిన గోతులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు సుమారు రూ.10 లక్షల వ్యయంతో పూర్చే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాశీ మాట్లాడుతూ జయలక్ష్మి థియేటర్, బస్టాండ్ సెంటర్, ముత్యాలమ్మ గుడి నుంచి వచ్చే రహదారుల్లో కొన్ని ప్రాణాలు పోయాయన్నారు. ఇదంతా నాటి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ హయాంలో జరిగాయన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లను చేపట్టాలని కమిషనర్ కు ఆదేశించారన్నారు. అవసరమైతే తన సొంత నిధులు వెచ్చిస్తానని తెలిపారన్నారు. 2014 నుంచి 2019 వరకు నియోజకవర్గంలో 280 రోడ్లు వేయడం జరిగిందన్నారు. అదే 2019 నుంచి 2024 వరకు 32 రోడ్లు వేయడం దుర్మార్గమన్నారు. జగనన్న కాలనీలో పూడిక పనులకు ఏడు కోట్లు ఖర్చు చేశారని, దానికి సంబంధించి ఎవరికి బిల్లులు చేశారో చెప్పలేని పరిస్థితిలో సిబ్బంది ఉన్నారన్నారు. దీనిపై విచారణకు ఎమ్మెల్యే శ్రీనివాస్ ఆదేశించారన్నారు. పాలూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు రోజుల్లోనే రహదారి పనులు చేపట్టడం శుభ పరిణామమన్నారు. తాడేపల్లిగూడెం అభివృద్ధికి ఇది ఆరంభమన్నారు. కమిషన్లు ఇస్తేనే గాని గత డిప్యూటీ సీఎం హయాంలో గోతులు పూడ్చే పరిస్థితి లేదన్నారు. గుండుబోగుల సురేష్ మాట్లాడుతూ గత డిప్యూటీ సీఎం పట్నంలో గోతులు పూడ్చలేని అసమర్ధునిగా నిలిచారన్నారు. అభివృద్ధిలో నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ పరుగులు పెట్టిస్తారన్నారు. పాతూరు ప్రాంత ప్రజలు పడుతున్న విద్యుత్ ఇబ్బందులను ఎమ్మెల్యే శ్రీనివాస్ వెంటనే పరిష్కరించారన్నారు. ఆయన చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. అంతేకాకుండా రహదారి మరమ్మతు పనులను మున్సిపల్ ఇన్చార్జ్ కమిషనర్ మురళీకృష్ణ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో వర్తనపల్లి కాశి, కాళ్ళ గోపి, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన చిన్న వెంకటరామయ్య, గురుజు సూరిబాబు, గుండు మొగుల సురేష్, పాలూరి బురయ్య,బయనపాలెపు ముఖేష్, చాపల రమేష్, అడబాల మురళి, గుండు మొగుల అయ్యప్ప, తదితరులు పాల్గొన్నారు.