పుణ్యక్షేత్రాలుసందర్శించిన ఎమ్మెల్యేబొలిశెట్టిశ్రీనివాస్
తాడేపల్లిగూడెం,
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం సందర్శించారు. ఆలయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గురవాయిగూడెంలోని మద్ది ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఆయన తనయులు బొలిశెట్టి రాజేష్ దంపతులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ద్వారకాతిరుమల చిన్న వెంకన్న సన్నిధిలో బొలిశెట్టి శ్రీనివాస్ కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో ప్రశాంతంగా ఉండే పశ్చిమగోదావరి జిల్లా లో ప్రతిష్టాత్మకమైన ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామిని, మద్ది ఆంజనేయ స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి పూజల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
పుణ్యక్షేత్రాలుసందర్శించిన ఎమ్మెల్యేబొలిశెట్టిశ్రీనివాస్

- Advertisement -
- Advertisement -