పెద్దపల్లి జిల్లా: అక్టోబర్ (వాయిస్ టుడే): గోదావరిఖని పర్యాటక కేంద్రంగా రామగుండం నియోజకవర్గం చరిత్రపుటల్లో నిలిచిపోతుంది నియోజకవర్గం పర్యాటక కేంద్రంగా మారిపోతుందని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు.

సోమవారం గోదావరి నది వద్ద తెలంగాణ టూరిజం బోటు ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నాడు చుక్క నీరు లేక ఎండి పోయిన గోదావరి చూశామని కెసిఆర్ పాలనలో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి నిండుకుండలా మారిందని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రైతులకు సాగునీరు పరిశ్రమలకు నీరు త్రాగునీరు అందించడం జరుగుతుందని అన్నారు. గోదావరి పరివాహక ప్రాంతమంతా పర్యాటక కేంద్రంగా మారబోతుందన్నారు. రామగుండం నియోజకవర్గం లోని ప్రజలు ఆహ్లాదకరంగా గడిపేందుకు ఉపయెాగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ దాతు శ్రీనివాస్ నాయకులు కౌశిక హరి తోకల రమేష్ తదితరులు పాల్గొన్నారు