మూడోసారి సీఎం కేసీఆర్ ప్రభుత్వమే…
విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి
పెద్దపల్లి: నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందుతానని, మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం నామినేషన్ లో భాగంగా శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావుతో కలిసి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. పెద్దపల్లి ప్రజలు విజ్ఞత గల వారిని మరోసారి ఆలోచించి ఓటును కారు గుర్తుకు వేయాలని కోరారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రాల్లో కూడా అమలు చేయడం లేదని తెలిపారు. అభివృద్ధిలో రాష్ట్రం మరింత ముందుకు సాగాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమని అన్నారు. మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయని లేదా 60 ఏళ్ల కష్టాలు మళ్ళీ వస్తాయని హెచ్చరించారు. బిఆర్ ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట ఓదెల దేవస్థానం చైర్మన్ మేకల మలేష్ యాదవ్, అసెంబ్లీ నియోజవర్గ ఇంచార్జ్ సర్దార్ రవీందర్ సింగ్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ చైర్మన్ లతో పాటు బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




