- Advertisement -
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర
MLA Gandra started rice grain buying centers
జయశంకర్ భూపాలపల్లి,
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేశాలపల్లి, పెద్దకుంటపల్లి, కాశింపల్లి, జంగేడు తో పాటు భూపాలపల్లి గ్రామీణ మండలం గుడాడుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. అనంతరం ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లో విక్రయించాలని రైతులకు సూచించారు. ధాన్యం తూకం విషయంలో రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.
- Advertisement -