తడిబట్టలతో ప్రమాణం చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ :జూన్ 25.
తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని హుజరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రమాణం చేశారు.
ఈరోజు చెల్పూరు ఆంజనే యస్వామి ఆలయంలో ప్రమాణం చేయాలని సవాళ్లు విసురుకోగా…. లాండ్ అండ్ ఆర్డర్ సమస్య కారణంగా పోలీసులు కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు.
దీంతో తన ఇంట్లోనే తడిబట్టలతో ఆంజనేయ స్వామి ఫొటోపై ప్రమాణం చేశారు. నేను ఎలాంటి అవినితీ చేయలేదని ప్రమాణం చేస్తున్నా..
పొన్నం ప్రభాకర్‌కి ఫ్లై యాష్ తో సంబంధం లేదని ప్రమా ణం చేయాలి.. దాంతో పాటు.. లోడ్ లారీలను ఎందుకు ఆపడం లేదో.ఆ లోడ్ లారీల నుంచి.వాటా రావడం లేదని..పొన్నం ప్రభాకర్ ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.
అలా ప్రమాణం చేస్తే… నేనూ బహిరంగ క్షమాపణ చెబుతా అంటూ మీడియా సాక్షిగా వెల్లడించారు..