- Advertisement -
పేద ప్రజల జోలికొస్తే ఊరుకోను-ఎమ్మెల్యే మాధవరం
MLA Madhavaram will not rest when it comes to poor people
కూకట్ పల్లి
40 సంవత్సరాలుగా నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం గడుపుతున్న పేద ప్రజల జోలికొస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూకట్ పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ స్థానిక కార్పొరేటర్ సభిహా గౌసుద్దీన్ తో కలిసి హైడ్రా నోటీసులు ఇచ్చిన కుటుంబాలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కలిశారు. స్థానిక కాలనీవాసులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా నివాసాలు ఉంటూ జీవనం గడుపుకుంటున్న తమ కడుపును కొట్టి ఇండ్లను కూల్చి వేస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో రాజీవ్ గాంధీ నగర్ కాలనీ ఏర్పాటు జరిగిందని అదే సమయంలో సబ్దర్ నగర్ , పద్మావతి నగర్ ప్రాంతాలలో ఇండ్లు కట్టుకొని నివాసాలు ఉండేవారని తెలిపారు అప్పటినుంచి కూలీలకు వెళ్లి కష్టం చేసుకుని జీవిస్తున్న నిరుపేద కుటుంబాలు జీవనం గడిపే ప్రాంతాలైన ఈ కాలనీలలో కొంతమంది రిజిస్ట్రేషన్లు చేసుకున్న ఇండ్లకు సైతం హైడ్రాధికారులు నోటీసులు జారీ చేయడం బాధాకరమైన విషయమని తెలిపారు. హైడ్రాధికారులకు బడా బాబులు చెరువులు కుంటలు కబ్జాలు చేసి భవంతులు నిర్మించుకుంటే వాటిని కూలగొట్టడం మర్చిపోయి పేదవారు నివసించే ప్రాంతాలలో కూల్చివేతలు చేపట్టడం సరికాదన్నారు .ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుపేదలు నివసించే ప్రాంతాలలో హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చి ప్రజలను నిద్ర లేకుండా భయభ్రాంతులకు గురి చేయడం సరైనది కాదని ఇలాంటి చర్యలకు పాల్పడితే పేద ప్రజలు తిరగబడతారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -