ఘనంగా ఎమ్మెల్యే మాధవరం జన్మదిన వేడుకలు
సికింద్రాబాద్
MLA Madhavaram’s birthday celebrated with grandeur
ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్, హస్మత్ పెట్ డివిజన్ లను, ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు ఎంతో అభివృద్ధి చేశారని, ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. మాధవరం కృష్ణారావు పుట్టినరోజు సందర్భంగా, హస్మత్ పెట్ 264వ డివిజన్ ఎస్సీ బస్తిలలో, ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి డివిజన్ మహిళలకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు 1000 పైగా చీరలను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్యాడ్స్, స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ… ప్రతిరోజు ఉదయం 6 గంటలకే డివిజన్లోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్న మాధవరం కృష్ణారావు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



