గంగాధరలో సిఎం కప్ క్రీఢా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
MLA Medipalli Satyam started the CM Cup sports competitions in Gangadharaచొప్పదండి
కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.గ్రామస్థాయి నుండి ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం సీఎం కప్ పేరుతో క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు.
2032 లో జరిగే ఒలంపిక్స్ లో పథకమే లక్ష్యంగా క్రీడాకారులను తయారు చేయడానికి సీఎం కప్ ఉపయోగపడుతోందని తెలిపారు.
రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి త్వరలోనే రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్య, క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులను, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. విడతల వారీగా రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు.చొప్పదండి నియోజకవర్గంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సంపూర్ణ సహాయ సహకారాలను అందజేస్తామని తెలిపారు.విద్యార్థులు చదువుతోపాటుగా క్రీడలను భాగంగా చేసుకోవాలని కోరారు.
విద్యార్థులు సీఎం కప్పును సద్వినియోగం చేసుకొని రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు,గంగాధర మార్కెట్ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, గంగాధర సింగల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, గంగాధర మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎంపీడీవో రామ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, నాయకులు దుబ్బాసి బుచ్చయ్య ,సత్తు కనుకయ్య, పడాల రాజన్న,బుర్గు గంగన్న,జాగిరపు శ్రీనివాసరెడ్డి ,రోమాల రమేష్ ,గునుకొండ బాబు ,గుజ్జుల బాపురెడ్డి ,దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, గంగాధర సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.




