పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోపాల్గోన్న  ఎమ్మెల్యే నెహ్రు

- Advertisement -

పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోపాల్గోన్న  ఎమ్మెల్యే నెహ్రు

MLA Nehru who participated in the pension distribution program

జగ్గంపేట
అభాగ్యులను ఆదుకునే ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెహ్రు పాల్గొన్నారు. 1 వతేది ఆదివారం సచివాలయం సిబ్బందికి శెలవు కావడంతో 31 వ తేదిన పింఛన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే  పాల్గొని
మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమాన్ని అందించే ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం అని ఆయన అన్నారు. పెన్షన్ దారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొనిసెప్టెంబరు ఒకటవ తేదీ ఆదివారం రావడం వలన ఒక్కరోజు ముందుగానే ఆగస్టు 31వ తేదీన పెన్షన్లు ఇవ్వడం జరిగిందని అన్నారు. సంక్షేమం అంటే ఇది కాదా అని ప్రతిపక్షాలను నెహ్రూ ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రతినెల 1వ తారీఖున జీతాలు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్ గాని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కానీ ఏ తేదీన వస్తాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొని ఉండేదని, కానీ ఇప్పుడు ప్రతినెలా ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular