- Advertisement -
సిసి రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
MLA Padmarao Goud started the construction works of CC roads
సికింద్రాబాద్
గత పదేళ్ళ కాలంలో సికింద్రాబాద్ లో తాము ప్రారంభించిన చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను నిరాటంకంగా కొనసాగిస్తామని, అందుకు ఎన్ని కష్టాలైన ఎదుర్కొనేందుకు సిద్దమని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫల్ మండీ డివిజన్ పరిధిలోని భవానీ నగర్ లో రూ.20 లక్షల ఖర్చుతో నిర్మిస్తున్న సి.సీ. రోడ్డు నిర్మాణం పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. సితాఫల్ మండీ పరిధిలో అన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. కార్పొరేటర్ సామల హేమ తో పాటు జీ.హెచ్.ఎం.సీ.,జలమండలి, రెవిన్యూ అధికారులు విద్యా సాగర్, స్వర్ణ లత, కౌశిక్, కుశాల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -