Wednesday, October 16, 2024

సత్యవేడు ఎమ్మెల్యే సస్పెండ్

- Advertisement -

సత్యవేడు ఎమ్మెల్యే సస్పెండ్
విజయవాడ, సెప్టెంబర్ 5

MLA Satyavedu suspended

లైంగిక వేధింపుల వివాదంలో ఇరుక్కున్న సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుుకన్నారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశం పెట్టిన ఓ మహిళ..  సత్యవేడు ఎమ్మెల్యేతో ఏకాంతంగా ఉన్న దృశ్యాలు  బయట పెట్టారు. తనను వేధించి లోబర్చుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే తీరును తీవ్రంగా పరిగణించిన హైకమాండ్.. సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.లైంగిక వేదింపులు చేసిన మహిళ కూడా టీడీపీకి చెందిన కార్యకర్తనేని చెబుతున్నారు. సొంత పార్టీ చెందిన మహిళా కార్యకర్తల్ని లైంగికంగా వేధించడాన్ని తెలుగుదేశంపార్టీ హైకమాండ్ సీరియస్ గా  తీసుకుంది. ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని విషయం తెలిసిన వెంటనే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబబుునాయుడు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. వివరణ అయినా .. సస్పెండ్ చేసిన తర్వాతనే తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు వెంటనే పల్లా శ్రీనివాసరావు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలను కోనేటి ఆదిమూలం ఖండిస్తున్నారు.  మహిళ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే.. కొన్ని మీడియా సంస్థలలుు ఆయనను సంప్రదించాయి. తెలుగుదేశం పార్టీ నేతలే తనపై కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. నిజానికి ఆయన తెలుగుదేశం పార్టీ తరుపనే గెలిచినా..  గత ఎన్నికల ముందు వరకూ వైసీపీలో ఉన్నారు. టిక్కెట్ రాకపోవడంతో టీడీపీలో చేరారు. టీడీపీ ఆయనకు టిక్కెట్ ఇచ్చింది. మూడు వేల ఓట్ల స్వల్ప తేడాతో ఆయన రెండో సారి విజయం సాధించారు. అంతకు ముందు రెండు సార్లు వైసీపీ తరపున  పోటీ చేశారు. 2019లో వైసీపీ తరపున గెలిచారు. ఆయన టీడీపీలో చేరడం.. సత్యవేడు స్థానిక టీడీపీ నేతలకు ఇష్టం లేకపోయింంది. ఆయనకు వ్యతిరేకంగా పని చేశారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు వాళ్లే తనపై కుట్ర చేశారని అంటున్నారు. అంటే టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరాటంతోనే ఈ వివాదం బయటకు వచ్చిందని తెలుస్తోంది. పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా తెలియడంతో కోనేటి ఆదిమూలం  ఆజ్ఞాతంలోకి వెళ్లారు. ఫోన్ స్విచ్చాఫ్ చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన మహిళ.. కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించి లొంగ దీసుకున్నారని ఆరోపించారు. పెన్ కెమెరా పెట్టుకుని రికార్డు చేశానని చెప్పారు. కొన్ని ప్రైవేటు వీడియోలు కూడా రిలీజ్ చేశారు. అందలో కోనేటి ఆదిమూలం శృంగారం దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ వ్యవహారంలో అసలేం జరిగిందో మొత్తం బయటకు రావాల్సి ఉంది.

MLA Satyavedu suspended

నా భర్త చాలా మంచోడు
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పై వచ్చిన లైంగిక ఆరోపణలను ఆయన కుటుంబ సభ్యులు తప్పుబట్టారు. గురువారం ఆదిమూలం భార్య గోవిందమ్మ మాట్లాడుతూ.. ‘నా భర్త అలాంటివాడు కాదు. రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రపూరితంగానే ఇలాంటి అబండాలు వేస్తున్నారు. నా భర్త నలుగురు పిల్లలు తండ్రి. ఈ వయస్సులో ఇలాంటి పనులు ఎలా చేస్తారు? బాధ్యత గల ఒక తండ్రిగా బిడ్డలను పెంచి పెళ్ళిళ్ళు చేసారు. ఏ ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోరని నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆయన అందరికీ సహాయపడ్డారు. నలుగురికీ మంచి చేసే తత్వం ఉన్న వ్యక్తి నా భర్త ఆదిమూలం. అతని ఎదుగుదలను ఓర్వలేక కుట్రపూరితంగా అతని రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలని కొందరు టీడీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా నా భర్త కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు’ఇంకా ఆమె ఈ విధంగా మాట్లాడారు.. ‘రెండవ సారి ఎమ్మెల్యేగా గెలవడంతో జీర్ణించుకోలేని కొందరు ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారు. అందుకే తెరవెనుక కుట్రలు చేస్తున్నారు. ప్రస్తుతం నా భర్త ఆరోగ్య పరిస్తిస్థితి సరిగాలేదు. నిన్న రాత్రి చికిత్స కోసం చెన్నైకి వెళ్లారు. అక్కడ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలన్నీ ఫేక్. నకిలీ వీడియోలు. నామినేటెడ్ పదవులు కోసమే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు. ఓటు వేయని వారు కూడా పదవుల కోసం ఇలాంటి పనులు చేస్తున్నారని.. ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదిమూలం కొడుకు సుమన్, భార్య గోవిందమ్మ, కూతుళ్లు, అల్లుడు జాన్ కెనడీ  మాట్లాడారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్