జూబ్లీహిల్స్‌లో 1 కోటి 38 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్: వాయిస్ టుడే
MLA V. Naveen Yadav laid the foundation stone for development works worth Rs 1 crore 38 lakhs in Jubilee Hills
షేక్పేట్ డివిజన్‌లోని ఓయూ కాలనీలో డ్రైనేజీ మరియు వాటర్ లైన్ అభివృద్ధి కోసం రూ.1 కోటి 38 లక్షల వ్యయంతో జరుగనున్న పనులకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జూబ్లీహిల్స్ ప్రాంత అభివృద్ధి గతంలో ఎన్నడూ లేని స్థాయికి చేరుతోందని తెలిపారు. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు గడ్డం వివేక్ వెంకటస్వామి రూ.200 కోట్లను జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
షేక్పేట్ డివిజన్‌లో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పనులు వేగంగా పూర్తి చేయించేందుకు కృషి జరుగుతోందని చెప్పారు.
ఎమ్మెల్యే నవీన్ యాదవ్ షేక్పేట్ డివిజన్‌ను అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపే విధంగా మార్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు దయం శేఖర్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు, జిహెచ్ఎంసి అధికారులు, జలమండలి విభాగ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



