- Advertisement -
సంక్రాంతి కానుకల పంపిణీలో పాల్గోన్న ఎమ్మెల్యే వనమాడి
MLA Vanamadi participated in the distribution of Sankranti giftsకాకినాడ
అందరూ ఐక్యంగా ఉంటూ సంఘం అభివృద్ధికి కృషి చేయాల ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. :-కాకినాడ వార్పురోడ్డులో గల ది. కాకినాడ మిని గూడ్స్ లారీ అండ్ వ్యాన్ ఓనర్స్ వేల్పైర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం జరిగింది. సంఘం అధ్యక్షులు చొక్కా నానాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిటి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ముందుగా సంఘం కార్యాలయం సమీపంలో గల వినాయకుని ఆలయంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంఘం కార్యాలయంకు చేరుకుని కార్యాలయంను పరిశీలించారు. అనంతరం సంఘం అధ్యక్షులు చొక్కా నానాజీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిటి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ సంఘం సభ్యులంతా ఐక్యంగా ఉంటూ సంఘం అభివృద్దికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో పండుగ జరుపుకొవాలని, సంఘం కార్యవర్గ సభ్యులు మంచి అలోచనతో పండుగ కానుకను ఇవ్వడం అభినందనీయమన్నారు. సంఘం అధ్యక్షులు చొక్కా నానాజీ మట్లాడుతూ సంఘం పేరుతో ఎవరి వద్దకు వెళ్ళి సోమ్ములను వసూలు చేయలేదని, సంఘం సభ్యులు వారి సంక్షేమం నిధి ద్వారానే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని వివరించారు. అనంతరం సంఘం సభ్యులకు పండుగ కానుకను పంపిణి చేసారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడిని సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టి.ఎన్.టి.యు.సి. కాకినాడ జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబు, ది.కాకినాడ మిని గూడ్స్ లారీ అండ్ వ్యాన్ ఓనర్స్ వేల్పైర్ అసోసియేషన్ కార్యదర్శి పిల్లి రాముడు, కోశాధికారి గరగ వీరకుమార్, వైస్ ప్రెసిడెంట్ పరిమి రామారావు, జాయింట్ సెక్రటరీ బంధం బాబుతో పాటు సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -




