ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 23 వరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. లిక్కర్ స్కామ్ కేసులో కవితను మూడు రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించారు. ఈ మూడు రోజుల కస్టడీ ముగియడంతో.. ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో సోమవారం హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాదులు, కవిత తరఫున న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించామని.. విచారణకు ఆమె సహకరించలేదని సీబీఐ ఆరోపించింది. ఉద్దేశ పూర్వకంగా విచారణను తప్పుదోవ పట్టించేలా ఆమె సమాధానాలు చెప్పారని వెల్లడించింది. ఆమెను విచారించేందుకు మరింత సమయం కావాలని కోరింది. ఈ నేపథ్యంలో కవిత కస్టడీని కోర్టు పొడిగించింది. . దీని ప్రకారం.. కవిత ఏప్రిల్ 23వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. కోర్టుకు హజరయిన సమయంలో కవిత మాట్లాడుతూ ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని అని అన్నారు.
ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగింపు
- Advertisement -
- Advertisement -