సీఎం రేవంత్ రెడ్డి మీద ఎమ్మెల్సీ కవిత ఫైర్
కామారెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.కామారెడ్డిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తిప్పారం గ్రామానికి చెందిన హర్యల వెంకట్ బోధన్ హాస్టల్ లో జరిగిన చిన్న సంఘటనలో మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం. హాస్టల్ వార్డెన్, వాచ్ మెన్ లేకపోవడం వలన జరిగిన చిన్న సంఘటనలో ఒకరు చనిపోవడం ఎనిమిది మంది విద్యార్థులపై మర్డర్ కేసు నమోదైంది. మర్డర్ కేసు నమోదు కావడం వల్ల ఎనిమిది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థత, పట్టింపులేని చర్యల వల్లనే ఈ సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఅర్ పై పడి ఎడ్చుడే తప్ప ఈ మూడు నెలల్లో ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల చావులు చుసమంటే, మళ్ళీ గత మూడు నెలల్లో చూసాం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు విద్య శాఖకు మంత్రి లేకపోవడం మన దురదృష్టం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా రివ్యూ నిర్వహించి పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
ఇదేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన. ఇప్పటికైనా గురుకుల పాఠశాలల్లో వాచ్ మెన్ లేకపోతే ఒక పోలీస్ కానిస్టేబుల్ ని నియమించాలని జిల్లా కలెక్టర్ ను కోరాము. మృతుని తల్లికి పెన్షన్, సోదరునికి ప్రభుత్వ ఉద్యోగం, 15 లక్షల నష్టపరిహారం, ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆర్ఎస్ఎస్ భవాజావాలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. బిఅర్ఎస్, బిజెపిలు ఒకటే అని ఆన్న రేవంత్ రెడ్డి నిన్నటి సభలో మోడీ పెద్దన్న అనడంతో రేవంత్ రెడ్డి నిజస్వరూపం తెలిసింది. బీజేపీ కాంగ్రెస్ ముమ్మాటికీ ఒక్కటే.. ప్రాంతీయ పార్టీలు ఉండొద్దనేది ఇరు పార్టీల లక్ష్యం ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న రేవంత్ ప్రధాని మోడీని పెద్దన్న అనడంలో అతిశయోక్తి లేదు. కానీ తెలంగాణ కి బడ్జెట్ లో ఒక్క రూపాయి కేటాయించకపోవడం పై ఎందుకు ప్రశ్నించలేదని ఆమె అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మీద ఎమ్మెల్సీ కవిత ఫైర్
- Advertisement -
- Advertisement -