ఎమ్మెల్సీ వెంకటరాం రెడ్డిని అరెస్టు చేయాలి
బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
హైదరాబాద్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్ రామిరెడ్డి ని అరెస్ట్ చేయాలనీ డీజీపీ కి ఫిర్యాదు చేసామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.శనివారం అయన డీజీపీని కలిసారు.తరువాత మీడియాతో మట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసు లో వెంకట్ రామిరెడ్డి పాత్ర ఉందని మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్ మెంట్ ఇచ్చాడు. అసెంబ్లీ ఎన్నికల సమయం లో వెంకట్ రామిరెడ్డికి సంబందించిన మూడు కోట్లు తరలించినట్లు రాధాకిషన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. వెంకట్ రామిరెడ్డి పై ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకు వెంకట్ రామిరెడ్డి ని కాపాడుతున్నారు.. ఎవ్వరు కాపాడుతున్నారు. సమాధానం చెప్పాలని డీజీపీ ని కోరాను. పొంగులేటి వియంకుడు వెంకట్ రామిరెడ్డి ని అరెస్ట్ చెయ్యడం లేదా…ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి .బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నా కూడా అరెస్ట్ చెయ్యడం లేదు.. వెంకట్ రామిరెడ్డి ని కులం ఒకటే అని ముఖ్యమంత్రి కాపాడుతున్నాడు. వెంటనే వెంకట్ రామిరెడ్డి ని అరెస్ట్ చేయాలి. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా వెంకట్ రామిరెడ్డి ని అరెస్ట్ చేయాలని అయన అన్నారు.
ఎమ్మెల్సీ వెంకటరాం రెడ్డిని అరెస్టు చేయాలి బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

- Advertisement -
- Advertisement -