Tuesday, March 18, 2025

 మోడీ, రాహుల్ కులాల కుంపట్లు

- Advertisement -

మోడీ, రాహుల్ కులాల కుంపట్లు
హైదరాబాద్, ఫిబ్రవరి 18, (వాయిస్ టుడే)

Modi and Rahul are clans

తెలంగాణ రాజకీయాల్లో కొద్ది రోజుల నుంచి టాపిక్ మారిపోయింది. రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ బీసీ కాదని ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని వాదిస్తున్నారు. వెంటనే బీజేపీ నేతలు రాహుల్ గాంధీ కులం, మతం ఏమిటని ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ వాదోపవాదాలు రెండు పార్టీల మధ్య హోరాహోరీగా సాగుతున్నాయి. ప్రతీ రోజూ ఎవరో ఒకరు ఈ అంశంపై చర్చ  పెడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఆ పార్టీ నుంచి కూడా ఎవరూ ఈ టాపిక్ నుంచి మాట్లాడటం లేదు. బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే ఈ టాపిక్ అందుకున్నాయని బీఆర్ఎస్ అనుమానిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీది బీసీ కులం కాదని ఆయనది అగ్రకులమని అయినప్పటికీ తనను తాను బీసీగా చెప్పుకుని రాజకీయలబ్ది పొందుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై వారు కాంగ్రెస్ పార్టీ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. మోదీ కులాన్ని రాజకీయంగా చర్చకు పెడుతున్నారు. వీరు మోదీని విమర్శిస్తే బీజేపీ నేతలు ఊరకనే ఉండే అవకాశం లేదు. వారు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. రాహుల్ గాంధీని టార్గెట్ చేసి ఆయనది .. ఏ కులం, ఏ మతం అని ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీ కులమతాలపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ పార్టీ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. దేశవ్యాప్తంగా కులగణన చేసి .. ఆ ఫాంతో రాహుల్ గాంధీ ఇంటికి వెళ్తే ఏ కులమో తెలుస్తుందని కొంత మంది నేతలు సెటైర్లు వేస్తున్నారు. జగ్గారెడ్డి అయితే నేరుగా స్పందిస్తున్నారు. రాహుల్ గాంధీ బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి అని.. హిందువు అని చెబుతున్నారు. అయితే బీజేపీ మాత్రం రాహుల్ ఇల్లీగల్లీ కన్వెర్టడ్ గాంధీ అని విమర్శలు చేస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య తమ అగ్రనేతల, కుల మతాలపై చర్చ మాత్రం తెగడం లేదు. ఈ కుల, మతాల చర్చలోకి భారత రాష్ట్ర సమితి రాలేదు. అయితే ఈ రెండు జాతీయ పార్టీలు కుట్రపూరితంగా కుమ్మక్కు రాజకీయాలు చేసి కుల, మతాలపై చర్చలు పెడుతున్నారని.. తెలంగాణ  ప్రజా సమస్యలను చర్చకు రానివ్వడం లేదని ఆరోపిస్తున్నారు. రాహుల్, మోదీలది ఏ కులం, ఏ మతమయితే ఏంటని.. తెలంగాణలో అమలు చేయాల్సిన హామీలను మలు చేయాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో ప్రజావ్యతిరేకత కాంగ్రెస్ పై పెరుగుతూంటే..దాన్ని చర్చకు రానివ్వకుండా బీజేపీ సహకరిస్తోందని బీఆర్ఎస్ అనుమానిస్తోంది. అందులో రాజకీయం ఉందో లేదో కానీ.. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే తెలంగాణ పొలిటికల్ వార్ ఫిక్సయింది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్