- Advertisement -
మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను మానుకోవాలి
Modi government should avoid pro-corporate policies
ఐఎఫ్టియు .శ్రామిక స్పందన *ఏ.ఐ.కె.ఎం. ఎస్ – ఐ.ఎఫ్.టీ. యూ సంఘాల ఆధ్వర్యంలో
నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం
నిర్మల్ నవంబర్ 27
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (SKM), జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఐఎఫ్టియు .శ్రామిక స్పందన *ఏ.ఐ.కె.ఎం. ఎస్ – ఐ.ఎఫ్.టీ. యూ సంఘాల ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు శ్రామిక స్పందన రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సుధాకర్ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కే రాజన్న సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజు రైతు సంఘం జిల్లా కార్యదర్శి నూతన్ కుమార్ పాల్గొని .మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేస్తున్నారని అన్నారు. కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాల మూలంగా దేశ ప్రజలు, రైతులు,కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని మండి పడ్డారు. నాలుగు లేబర్ కోడ్ ల వల్ల కనీస వేతనం, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, ఎనిమిది గంటల పని దినం, కార్మిక హక్కులను కాలరాస్తూన్నారని అన్నారు. అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర వ్యవసాయ ఖర్చుకు 50 శాతం అదనంగా జోడించి అమలు చేయాలని, రుణమాఫీ చట్టం తీసుకురావాలని అన్నారు. కార్పొరేట్ శక్తుల, బహుళజాతి సంస్థలపై ఉన్న ప్రేమ దేశ ప్రజలపై మోడీ ప్రభుత్వానికి లేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. మోటార్ రంగ కార్మికులకు 12 వేల ఆర్థిక సహాయం, రైతు రుణమాఫీ, ఫించన్లు పెంపు, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సహాయం లాంటి హామీలు నీటి బుడగలు గానే మిగిలాయని ఎద్దేవా చేశారు. రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ లగచర్ల లాంటి ప్రాంతాల్లో ఫార్మా కంపెనీల కు రైతు సాగు భూములను బలవంతంగా గుంజుకుంటుందని, ప్రశ్నించిన రైతులపై కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తోందని అన్నారు. అన్ని రకాల రైతు పంటలకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి రోజుకు 600 రూ,,లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో భారత రైతు కూలి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సయ్యద్ మహమూద్ అదిలాబాద్ జిల్లా కార్యదర్శి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -