హైదరాబాద్, అక్టోబరు : మోడీని బండి సంజయ్ దేవుడు అంటారు.. ఆయన ఎవ్వరికి దేవుడో చెప్పాలని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీళ్ళు ఇయ్యక పొతే ఓట్లు అడగను అని చెప్పిన దమ్మున్న సిఎం కేసీఆర్. కాంగ్రెస్ ఉన్నప్పుడు 200 లునిస్తే ఇప్పుడు రెండు వేలు పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. 70 లక్షల ఖాతాల్లో రైతు బందు వేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. 50 ఏళ్లలో చేయలేని పని 10 ఏళ్లలో అయిందని మోది మీద మాట్లాడుతున్నారు..గాలి మోటారు మిద వచ్చి మోది గాలి మాటలు మాట్లాడి వెళ్లారని మండిపడ్డారు. మేము ఢిల్లీ గులాం లం కాదు. ఎవ్వరు బీటీం కాదని తెలిపారు. సిలిండర్ ధర 12 వందలు చేసి ఇక్కడ చెప్పితే ఎట్లా? అన్నారు. బండి సంజయ్ మోది దేవుడు అంటారు ఎవ్వరికి దేవుడో చెప్పడం లేదని ప్రశ్నించారు. పిచ్చోల్లకు ఓట్లు వేద్దామా? 15 లక్షలు ఏవి అని నిలదీయండని తెలిపారు. 15 లక్షలు వచ్చిన వాళ్ళు బిజేపి నాయకుల కు ఓట్లు వేయండి.. రైతు బంధు వచ్చిన వాళ్లలు మాకు ఓటు వేయండని అన్నారు. ఒక్కటె రైలు కు అన్ని చోట్ల జెండాలు ఉపుతాండ్లంటు మాట్లాడారు.నేను సిఎమ్ కావాలంటే మోది ఎన్ ఓ సీ అవసరం లేదని కేటీఆర్ మండిపడ్డారు. హిందూ ముస్లిం అని మత పిచ్చి లేపుడే వాళ్ల పని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్లకి 11 ఏళ్లు అవకాశం ఇచ్చాం ఇంకా ఒక్క ఛాన్స్ ఇవ్వు అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ సచ్చిన పాము.. ఆరు గ్యారంటీ లు అని సఛ్చి వాళ్ళని లేపుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్ళకీ ఒక్కసారి కాదు 11 సార్లు 55 ఎoడ్లు ఛాన్స్ ఇచ్చినా ఏం చేశారని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి హయాంలో త్రాగు సాగు నీరు అందలేదని అన్నారు. కేసీఅర్ పాలనలో ఒక్క సంవత్సరం కరువు కాటకాలు లేవని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో 17 ప్రాజెక్టులు నిర్మించామన్నారు. నిర్మల్ జిల్లా లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ 27 ప్రారంభించామని తెలిపారు. త్వరలోనే చనాఖ కొరాట, సదర్మాట్ పూర్తి అవుతాయని అన్నారు. అభివృధ్ది అంటే తెలంగాణ రాష్ట్రాన్ని చూసీ నేర్చుకోవాలని తెలిపారు.