- Advertisement -
ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్-ITBP ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ITBP సిబ్బంది అసాధారణమైన పరాక్రమానికి నమస్కరిస్తున్నట్లు చెప్పారు.
దేశాన్ని రక్షించడంలో వారు కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు.
ప్రకృతి వైపరిత్యాల సమయంలో వారి సేవలు ప్రశంసనీయమైనవన్న ప్రధాని మోదీ.
దేశంపట్ల వారి అచెంచలమైన నిబద్ధతకు వారి సేవలు నిదర్శనమన్నారు.
అదే అంకిత భావం, ఉత్సాహంతో భవిష్యత్తులోనూ వారి సేవలు కొనసాగించాలని ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు.
- Advertisement -