- Advertisement -
టీడీపీ గూటికి మోహన్ బాబు
Mohan Babu for TDP
తిరుపతి, జనవరి 23, (వాయిస్ టుడే)
చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు మోహన్‌బాబు విద్యాసంస్థల ముందు వెలిసిన ఫ్లెక్సీలు హాట్ టాపిక్‌గా మారాయి. ఎంబీయూ ముందు తాజాగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్లేక్సీలు సినిమా సెట్టింగులని తలపిస్తున్నాయి. గతంలో అక్కడ అభిమానులు ఏర్పాటు చేసిన బాలకృష్ణ ప్లేక్సీలను ఎంబీయూ సిబ్బంది తొలగించారు. ఇప్పుడు పాతమిత్రుడితో మోహన్‌బాబు దిగిన ఫొటోలతో పెద్దపెద్ద ఫ్లెక్సీలు అక్కడ ప్రత్యక్షమవ్వడం చర్చనీయాంశంగా మారిందిమంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్న ఆయన తనయుడు మంచు మనోజ్.. హైదరాబాద్ లోని ఇంటికి వెళ్లిన సందర్భంగా ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత తాజాగా సంక్రాంతి సందర్బంగా మోహన్ బాబు తల్లి తండ్రుల సమాధుల్ని దర్శించుకునే పేరుతో మనోజ్ మరో రచ్చకు తెరదీశారు. దానికి సంబంధించి ఇరువర్గాలపై హైదరాబాద్, చంద్రగిరిల్లో కేసులు మోదు అయ్యాయి. మొత్తానికి మంచు ఫ్యామిలీ విభేదాలు డెయిలీ సీరియల్‌లా కొనసాగుతూనే ఉన్నాయఆ విభేదాలను పక్కన పెడితే సంక్రాంతి వేళ తన ఎంబీ యూనివర్సిటీ వద్ద మోహన్ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పోస్టర్లు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. వర్సిటీ ఆవరణలో చంద్రబాబుతో కలిసి ఉన్న డిజిటల్ బోర్డులను ,ఫ్లెక్సీలను మోహన్ బాబు ప్రత్యేకంగా ఏర్పాటు చేయించడం, దానికి తోడు కుమారుడు విష్ణు సైతం నారా లోకేష్ తో ఉన్న ఫోటోలతో ఫ్లెక్సీలు వేయించడం పొలిటికల్‌గా హీట్ రేపుతోంది. అసలు కొన్నాళ్ళుగా మోహన్ బాబు.. పొలిటికల్‌గా ఏ రూట్ వెళ్ళాలో తెలియక మౌనంగా ఉన్నారనే చర్చ జోరుగా సాగుతున్న సమయంలో ఈ ఫ్లెక్సీలతో ఆయన అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకున్నారుఒకప్పుడు టీడీపీలో యాక్టివ్ గా ఉన్న మంచు భక్తవత్సలం నాయుడు 1995 నుంచి 2001 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా పని చేశారు. 2019 ఎన్నికల సమయానికి వైసీపీకి జై కొట్టారు. చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. దానికి తోడు మోహన్‌బాబు, మంచు విష్ణులు తన విద్యా సంస్థలలో ఉన్న విద్యార్థుల ఓట్లను నమోదు చేయించి మరీ వైసిపి ఓట్లు వేయించారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నామినేషన్ రోజు రహాదారిని దిగ్బంధం చేసి మరీ నామినేషన్ కార్యక్రమం పెయిల్యూర్ చేయించడానికి ప్రయత్నము చేసాడనే విమర్శలున్నాయి. చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా వైసీపీకి సపోర్ట్ చేశారు.స్వయంగా జగన్ సొంత బాబాయ్ కుతురు విరానికారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న మంచు విష్ణు, తండ్రితో కలిసి వైసీపీ కోసం బానే కష్టపడ్డారు కానీ 2019 ఎన్నికల తరువాత.. ఎక్కడ లెక్కలు తేడా వచ్చాయో కాని వైసీపీతో టచ్ మీ నాట్ అన్నట్లుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. అప్పట్లో సినిమా ఇండస్ట్రీ సమస్యల విషయంలోనూ ప్రభుత్వంతో ఆయన చర్చలు జరిపింది లేదు. అయితే మా అసోసియేషన్ ఎన్నికల్లో వైసీపీ మద్దతుతోనే మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారన్నది ప్రత్యర్ధి వర్గం ఆరోపణ..వైసీపీ అధికారంలోకి రాగానే.. మోహన్ బాబుకు టీటీడీ ఛైర్మన్ లేదా రాజ్యసభ ఇస్తారనే ప్రచారం సాగింది. ఆ తరువాత ఫిలిం డెవలప్ మెంట్ బోర్డు ఛైర్మన్ పదవి ఇస్తారనే వాదన వినిపించింది. అయితే ఎటువంటి పదవులూ దక్క లేదు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తన విద్యాసంస్థకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలు చెల్లించలేదని మోహన్‌బాబు ధర్నాలు చేశారు. వైసిపి అధికారంలోకి వచ్చాక ఫీజు రియంబెర్స్ మెంట్ పాత బకాయిలు పూర్తి స్ధాయిలో విడుదల కాకపోయినా నోరు పెదపలేకపోయారు. అలా ఏ విధంగానూ అల్లుడు వరుసయ్యే జగన్ న్యాయం చేయకపోవడంతో గత ఎన్నికలలో ముందు నుండే వైసీపీ పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారు. సరిగ్గా చెప్పాలంటే వైసీపీతో ఆయన తెగతెంపులు చేసుకున్నారనే టాక్ నడుస్తూ వచ్చిందిప్రస్తుతం మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప నిర్మాణ పనులు చూసుకుంటున్నారు. మరోవైపు కుటుంబ విభేదాలు తారాస్థాయికి చేరి.. రెండు రాష్ట్రాలలో నమోదవుతున్న కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎన్నికల ముందు తన పేరు ఎవరు వాడుకోవద్దు అంటూ మోహన్ బాబు లేఖ విడుదల చేశారు. ఏదో తాను పిలుపు ఇస్తే బోల్డు ఓట్లు పడిపోతాయన్నట్లు ఆయన అలా లెటర్ రాయడం పలు విమర్శలకు దారి తీసింది.అయితే ఎన్నికల తర్వాత ఇప్పుడు ఉన్నట్టుండి సంక్రాంతి సందర్బంగా చంద్రబాబు, లోకేష్‌లతో కలిసి దిగిన ఫోటోలతో ఫ్లెక్సీలను, డిజిటల్ బోర్డులను తండ్రి కొడుకులు ఏర్పాటు చేయడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక మరో కుమారుడు మంచు మనోజ్ అయితే నేరుగా నారావారిపల్లి కెళ్ళి చంద్రబాబు ఇంట్లో నారా లోకేష్‌ని కుటుంబ సమేతంగా కలిసి వచ్చారు. అయితే 2014 నుంచే మంచు మనోజ్ టీడీపీ నేతలతోను, నారా లోకేష్, జనసేన పార్టీతోను మంచి సంబంధాలనే కలిగి ఉన్నారు.గత ఎన్నికల సమయంలోనూ మోహన్ బాబు విష్ణు ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా మౌనంగానే ఉండిపోయారు. ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ చెల్లెలు మౌనికారెడ్డిని వివాహమాడిన మంచు మనోజ్ మాత్రం కూటమికి బహిరంగంగానే మద్దతు పలికారు. మంచు ఫ్యామిలీలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నా.. ఇప్పటికే రకరకాల సమస్యలతో సతమతమవుతున్న మోహన్ బాబు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సరికొత్తగా రిలీజ్ చేసిన పొలిటికల్ పోస్టర్లు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయిఇటు కాలేజీ కార్యకలాపాలతో పాటు కన్నప్ప లాంటి భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతున్న సమయంలో ప్రభుత్వం నుండి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదనే ఉద్దేశంతోనే తన పాత మిత్రుడు సీఎం చంద్రబాబు నాయుడ్ని ఆలింగనం చేసుకోవడానికి మోహన్‌బాబు పోస్టర్లు రిలీజ్ చేశారన్న టాక్ జోరుగా సాగుతోంది … దాంతో వైసీపీతో ఇక తనకు సంబంధం లేదని ఆయన డైరెక్ట్‌గానే మెసేజ్ ఇచ్చారని అంటున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా పొలిటీషియన్లు … నేరుగా టీడీపీలోకి చేరలేకపోయినా, ఫోటోలు, ఫ్లెక్సీల ద్వారా తాను టిడిపికి దగ్గరయ్యాను అనే సందేశాన్ని ఇవ్వడమే ఆయన ఉద్దేశమని చెప్తున్నారు మోహన్‌బాబు సన్నిహితులు.అయితే ఈ పోస్టర్లపై టీడీపీ నేతలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. ఆయన పరిస్థితి బాగాలేదు కాబట్టే మళ్లీ చంద్రబాబుతో ఉన్న ఫోటోలను పెట్టుకున్నారని.. అయితే గతంలో ఆయన గతంలో చంద్రబాబు విషయంలో ఎలా వ్యవహరించారో, ఎంత పరుషంగా మాట్లాడారో మర్చిపోకూడదని సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు పోస్టులు పెడుతున్నారు. మరి చూడాలి పాత మిత్రుడి ఫ్లెక్సీల ఆహ్వానాన్ని టీడీపీ అధినేత ఎలా స్వీకరిస్తారో?
- Advertisement -