-
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం ప్రాజెక్టుల పేరిట వేల కోట్లు సంపాదించారు
-
అదే డబ్బులతో దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ఖర్చుపెట్టాలని చూస్తున్నారు
-
అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇంత అవినీతి గతంలో ఎవరు పాల్పడలేదు
-
బీసీ ముఖ్యమంత్రి ప్రతిపాదనకు తమ పార్టీ అనుకూలం
నాంపల్లి : జులై 31( వాయిస్ టుడే ): ప్రాజెక్టుల పేరిట ముఖ్యమంత్రి కుటుంబం వేల కోట్లు సంపాదించారని జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం 38 వేల కోట్ల తో అంచనతో ప్రారంభమై 1 లక్ష 40 వేల కోట్లకు చేరిందన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ గాంధీ సెంటనరి హల్ లో తెలంగాణ సమాజ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ వినయ్ ఆధ్వర్యంలో… రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రో కోదండరామ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కన్వీనర్ అలె భాస్కర్ తో పాటు… పలువురు రాజకీయ పార్టీ నేతలు హాజరయ్యారు. బీసీ ముఖ్యమంత్రి-రాజకీయ పక్షాల అభిప్రాయాలపై నేతలు ఈ సందర్భంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీసీ ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్ కు తమ పార్టీ కృషి చేస్తోందని తెలిపారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మాట ఇచ్చి… తానే ముఖ్యమంత్రి అయ్యి కేసీఆర్ మాట తప్పారని కోదండరాం అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో వనరులను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ఇలాగ అధికారం అడ్డుపెట్టుకొని డబ్బులు సంపాదించిన తీరు తాను ఎప్పుడు చూడలేదన్నారు. కాంట్రాక్టులన్ని మేఘ కంపెనీ చేతుల్లో పెట్టి , కింది స్థాయి కాంట్రాక్టర్లను విస్మరించారని అన్నారు. ఇన్నివేల కోట్లు సంపాదించి , ఇప్పుడు దేశం మొత్తం ఎన్నికల్లో ఖర్చు పెడతానని ముఖ్యమంత్రి కేసీఆర్ బయలుదేరాడని విమర్శించారు. ఇప్పుడున్న స్థితిలో 20 కోట్లు లేనిదే ఒక ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు కేంద్రంగా ఉన్న ఎన్నికలను , ప్రజల కేంద్రంగా మార్చాలని సూచించారు. అందుకోసం ప్రజలను చైతన్యం చేయాలని బిసి , ఎస్సి , ఎస్టీ , మైనార్టీలకు రాజ్యాధికారం దక్కాల్సిన అవసరం ఉందని… అందులో భాగంగానే బిసి ముఖ్యమంత్రి కావాలనే డిమాండ్ ప్రజల్లో వచ్చిందన్నారు. ఆ దిశగా అధికారం బదిలీ అయితే తెలంగాణ ప్రజల అభివృద్ధికి కోసం వనరులను ఉపయోగించుకోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ దిశగా తెలంగాణ జనసమితి పార్టీ కృషి చేస్తుందన్నారు. హైదరాబాద్ నగరాన్ని డల్లాస్, న్యూయార్క్ చేస్తామన్నారు. అభివృద్ధి పేరుతో కబ్జాలు చేశారు
టీజేఏస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల నష్టపోయిన బాధితులకు పరిహారం చెల్లించాలి. పట్టణ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని.. డల్లాస్, న్యూయార్క్ చేస్తామని ప్రకటనలు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, అధికార పార్టీ నాయకులు భూములను కబ్జాలు చేయడంతో చెరువులను కాలువలను ఆక్రమించారు. దాని పరిణామం మొత్తం నీళ్లన్నీ రోడ్ల మీదకి.. ఇండ్లలోకి వచ్చి చేరుతున్నాయి. గురుకుల పరీక్షలు ఒక్కో పేపర్ ఒక్కో ఊరిలో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు. పరీక్షలకు అవసరమైన చర్యలు తీసుకొని.. ఒకే గ్రామంలో పరీక్షలు నిర్వహించాలి. సొంత గ్రామాల్లో, సొంత ఊర్లోనే ఈ పరీక్షలకు అవకాశం ఇవ్వాలి. ఈ విషయాలపై క్యాబినెట్ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను.