ఎల్బీనగర్, వాయిస్ టుడే: మార్నింగ్ వాక్ లో భాగంగా గురువారం ఉదయం ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్‌లోని పెద్ద చెరువు ప్రాంతంలో ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కి గౌడ్ పాదయాత్ర చేస్తూ వాకర్స్ ను కలిశారు. మార్నింగ్ వాక్ కు ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుందని మధుయాష్కి గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మధుయాష్కి మాట్లాడుతూ రౌడీలు, గుండాలకు ఎల్బీనగర్ నెలవుగా మారిందన్నారు. నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇంచార్జి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్, మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షులు బుడ్డ సత్యనారాయణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు కళ్లెం సుజాత రెడ్డి, నాయకులు ఇరిగి రమేష్, స్వర్ణ మాధవి, రామ్మోహన్ గౌడ్, బొంగు వెంకటేష్ గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.



