పాకిస్తాన్ :అక్టోబర్ : పాకిస్తాన్‌లో తలదాచుకున్న టాప్ టెర్రరిస్టులు ఒక్కొక్కరు ఆకస్మాత్తుగా అంతమవుతున్నారు. పంజాబ్ లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడిలో మాస్టర్‌మైండ్‌గా ఉన్న భారత్ మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది షాహిద్ లతీఫ్ బుధవారం హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు.
పఠాన్‌కోట్ దాడి సూత్రధారి, భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షాహిద్ లతీఫ్ పాకిస్తాన్‌లో ఈ రోజు హత్యకు గురయ్యాడు.
2016లో పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి జరిగింది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడింది.
ఈ దాడిలో భారత సైన్యానికి చెందిన ఏడుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడికి లతీఫ్ ప్రధాన సూత్రధారి అని ఎన్ఐఏ విచారణలో తేలింది. పాకిస్థాన్‌లోని ఒక మసీదులో గుర్తు తెలియని దుండగులు అతన్ని కాల్చి చంపారు. అతను పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని సియాల్‌కోట్ నగరంలో హత్యకు గురయ్యాడు.



