Wednesday, March 25, 2026

నడిరోడ్డుపైనే తల్లికొడుకులు హత్య.

- Advertisement -

నడిరోడ్డుపైనే తల్లికొడుకులు హత్య.

Mother and son were killed on the road.

మెదక్, నవంబర్ 14, (వాయిస్ టుడే)

సంగారెడ్డి జిల్లాలో గురువారం దారుణం జరిగింది. ఓ వ్యక్తి నడిరోడ్డుపైనే తల్లీకొడుకులను కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్మడిదల మండలం బొంతపల్లిలోని వీరభద్రకాలనీలో ఈ ఘటన జరిగింది. బిహార్ రాష్ట్రానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి తల్లీకొడుకలను కత్తితో పొడిచి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు యూపీకి చెందిన సరోజాదేవి (50), అనిల్ (30)గా గుర్తించారు. కాగా, పాత గొడవలే హత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు.తన రెండేళ్ల కొడుకు చావుకు వీరు కారణమని అందుకే వారిని చంపినట్లు నిందితుడు నాగరాజు చెబుతున్నట్లు తెలుస్తోంది. తన భార్యపై కూడా మృతులిద్దరూ దాడి చేసేందుకు ఇంట్లోకి వచ్చినట్లు ఆరోపించాడు. కొడుకు చనిపోయిన రెండేళ్ల తర్వాత కక్ష పెంచుకుని ఈ రోజు కత్తితో దాడి చేయడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే కారణమా.?, వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా.? అని విచారిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నడిరోడ్డుపై డబుల్ మర్డర్ జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.మరోవైపు, ఇదే సంగారెడ్డి జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. నారాయణ్‌ఖేడ్‌లోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని.. వసతి గృహం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన హాస్టల్ సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
ప్రియుడితో కలిసి భర్త మర్డర్
అటు, నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని మహాత్మగాంధీ కాలనీ తండాలో పొలం వద్ద రాజునాయక్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులకు విచారణలో విస్తుపోయే విషయాలు తెలిశాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అతని భార్య ప్రియునితో కలిసి భర్తను చంపించినట్లు తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాత్మాగాంధీ కాలనీ తండాకు చెందిన రాజునాయక్ అదే తండాకు చెందిన హిమబిందును తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ బాబు, పాప సంతానం. ఇలా సాగుతున్న క్రమంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కళ్లెంచెరువు తండాకు చెందిన చంటి.. మహాత్మాగాంధీ కాలనీ తండాలో తన మేనమామ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే హిమబిందుతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఏడాదిగా వీరి తతంగం నడుస్తుండగా.. ఈ విషయం భర్త రాజునాయక్‌కు తెలిసి ఇద్దరినీ తీవ్రంగా మందలించాడు.
దీంతో తన భర్తను అడ్డు తొలగించుకోవాలని హిమబింధు భావించింది. ఈ నెల 7న రాజునాయక్ వేరుశనగ తోటలో ఉండగా.. ప్రియుడి చంటి, అతని స్నేహితుడు రాకేశ్, హిమబిందు కలిసి అతనిపై సుత్తితో దాడి చేసి చంపేశారు. మృతదేహాన్ని కొద్దిదూరంలో పడేశారు. తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్