- Advertisement -
తెలంగాణ తల్లి ఒక ప్రతిమ కాదు…
Mother of Telangana is not an idol...
సాంస్కృతిక వైభవానికి ప్రతీక
హైదరాబాద్
తెలంగాణ తల్లి ఒక ప్రతిమ కాదు. సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు. శనివారం జరిగిన తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో అయన మాట్లాడారు. ఉద్యమానికి స్పూర్తి ఉండేలా కేసీఆర్ తెలంగాణ తల్లిని తయారుచేయించారు. చరిత్ర నిర్మాణం, ఉద్యమాలు, గత వైభవాలపై అవగాహన లేకుండా సీఎం రేవంత్ రెడ్డి చరిత్రను చరిపేస్తున్నారు. బతుకమ్మ అంటే బతుకుజీవుడా అని కాదు… అది మహిళా శక్తికి ప్రతీక. తెలంగాణ అంటే బతుకమ్మ అనే విధంగా ఉన్న బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి తీసేశారు. తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప పేరు తేకున్నా పర్వాలేదు కానీ ఉన్న వైభవాన్ని తొలగించవద్దు. తెలంగాణ సంస్కృతిని కాపాడానికి ఎమ్మెల్సీ కవిత మరో పోరాటాన్ని ప్రారంభించాలి. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి ఎమ్మెల్సీ కవిత నాయకత్వం వహించాలని అన్నారు.
- Advertisement -