Wednesday, March 25, 2026

“అమ్మ మాట-అంగన్వాడి బాట”

- Advertisement -

రెండున్నర సం” నిండిన పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రంలో పేర్లు నమోదు చేసుకోవాలి
సిడిపిఓ వీరలక్ష్మి
జగిత్యాల,

“Mother’s Word-Anganwadi Path”

రెండున్నర సంవత్సరాలు నిండిన పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రంలో పేర్లు నమోదు చేసుకోవాలని సిడిపిఓ వీరలక్ష్మి తెలిపారు..జగిత్యాల ఐసిడిఎస్ ఆధ్వర్యంలో “అమ్మ మాట-అంగన్వాడి బాట” పేరుతో అవగాహన ర్యాలీని నిర్వహించారు.
జగిత్యాల మున్సిపల్ పరిధిలోని విద్యానగర్ అంగన్వాడి కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సిడిపిఓ వీరలక్ష్మి పాల్గొని తల్లులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిడిపిఓ వీరలక్ష్మి మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాలు నిండిన పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అంగన్వాడి కేంద్రానికి వచ్చే పిల్లలకు కొత్త సిలబస్ ప్రకారం ప్రీ స్కూల్ విద్యను అందించడం జరుగుతుందన్నారు. పిల్లలకు పోషకాహారాన్ని అందించడమే కాకుండా వారి ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎప్పటికప్పుడు పిల్లల ఎత్తు,బరువులను కొలుస్తూ వారి పోషణ స్థాయిని అంచనా వేసి తల్లిదండ్రులకు తగిన సూచనలు, సలహాలు అందించడం జరుగుతుందన్నారు. లోప పోషణ కలిగిన చిన్నారులకు అదనపు ఆహారాన్ని అందిస్తామని తెలిపారు. తల్లులు, మహిళా సంఘాల సభ్యులు పిల్లలను తమ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో తప్పనిసరిగా నమోదు చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కవితా రాణి, అంగన్వాడి టీచర్లు అరుణ, రజిని, యతీశ్వరి, జయమాల, అంజలి, కళావతి, మాధవి, నీలవేణి, భాగ్యలక్ష్మి, సీమ, లక్ష్మి, శివ ప్రియ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్