మునిసిపల్ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం
తోపులాట…ఉద్రిక్తత
ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ ధమ్మాలపాటి వెంకటేశ్వరరావు పై 19 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టాలని కలెక్టర్ను కోరారు. దాంతో సోమవారం జరుగుతున్న అవిశ్వాస తీర్మాన సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాగైనా చైర్మన్ పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్, మరియు బిఆర్ఎస్ పార్టీలు యోచిస్తుండడంతో, కౌన్సిలర్లను కాపాడుకోవడం, అవిశ్వాస తీర్మానంలో గెలుపొందేందుకు రెండు పార్టీల నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేసారు. ఈ నేపధ్యంలో పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట జరిగింది. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ బలవంతంగా లోనికి చొచ్చుకొని పోయే ప్రయత్నం చేయడంతో కాంగ్రెస్, బి.ఆర్.ఎస్ నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది.
మునిసిపల్ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం
- Advertisement -
- Advertisement -