Movement of pensioners post cards for endowment tax abolition :
దాయపు పన్ను రద్దుకు పెన్షనర్ల పోస్టు కార్డుల ఉద్యమం.
జగిత్యాల
కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లను ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలని,పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ కోసం పీ ఎఫ్ఆర్ డి ఏ చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ డిమాండ్ చేశారు.ఈ నెల 23 న కేంద్ర బడ్జెట్ లోక సభలో ప్రవేశ పెట్టనున్న దృష్ట్యా మంగళవారం జిల్లా కేంద్రంలోని అసోసియేషన్ కార్యాలయంలో సమావేశమై ప్రధాన మంత్రికి,కేంద్ర ఆర్ధికమంత్రికి పోస్టు కార్డులపై వినతులు రాసి థరూర్ క్యాంపు లో ఉన్న పోస్టల్ డబ్బాలో పోస్టు కార్డులు వేశారు. తమకు ప్రతిజ నెలా ఇచ్చే గౌరవ భృతి పెన్షన్ అంటూ,లేదా ఆదాయ పన్ను పరిమితి 15 లక్షలకు పెంచాలని ఆ పోస్టు కార్డుల్లో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శిజిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ,ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాతం,సహాయ అధ్యక్షుడు పి.సి.హన్మంత రెడ్డి,ఉపాధ్యక్షులు వెల్ముల ప్రకాష్ రావు,ఎం.డి.యాకూబ్,జగిత్యాల యూనిట్ అధ్యక్షుడు బి.రాజేశ్వర్,కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం,ధర్మపురి అధ్యక్షుడు కండ్లే గంగాధర్,మెట్ పల్లి అధ్యక్షుడు గంగారాం,జిల్లా ప్రతినిధులు దేవేందర్ రావు,సయ్యద్ యూసుఫ్,ఎం.డి.ఎక్బాల్,ప్రసాద్,