ఎమ్మిగనూరు బంద్ ప్రశాంతం …
– వర్గీకరణ కోసం ప్రాణాలు అర్పిస్తాం
– ఉద్యమంతో వర్గీకరణ అడ్డుకుంటాం
– మాల మహానాడు నాయకుల డిమాండ్
Movement will prevent categorization
ఎమ్మిగనూరు ఆగస్టు 21
పట్టణంలోని స్థానిక ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల నందు భారీగా మాల మహానాడు నాయకులు పాల్గొని ప్రశాంతంగా బంద్ చేయడం జరిగింది. బందుకు సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపిన మాల మహానాడు నాయకులు. రాజకీయ స్వలాభం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లు వర్గీకరణ చేయడం జరిగిందని, రాజకీయ ఎత్తుగడలతో అన్నదమ్ముల లాంటి ఎస్సీలను విభజించడం జరిగిందని తెలిపారు. ఇలా ఎస్సీ వర్గీయులు 59 ఉపకలాలను వారి స్వలాభం కోసం విభజించి పాలిస్తున్నారని తెలిపారు. వర్గీకరణ వ్యతిరేకం కోసం మాల మహానాడు నాయకులు ప్రాణాలైనా అర్పిస్తామని తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు ఉష మొహరం కమిషన్ ద్వారా తీర్పు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజకీయ స్వలాభం కోసమే వర్గీకరణ చేయడం జరిగిందని, ఇలాంటి వర్గీకరణలను సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం సిగ్గుచేటని, ఇలాంటి తీర్పులు వల్ల ప్రజలు సుప్రీంకోర్టు మీద ఉన్న నమ్మకం పోతుందని సూచించారు. వర్గీకరణ వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో మళ్లీ పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల. నరసన్న, మాల మహానాడు నాయకులు మాల పంపయ్య, మాల రాజోలప్ప, ఎద్దుల చెన్నయ్య, మాల మధుబాబు, మాల. మురళీకృష్ణ, బుడుమెద్దుల రవిచంద్ర, మాల నరసప్ప, గడ్డం నాగేంద్ర, మాల సత్యనారాయణ, మాల జట్టప్ప, సలువాది.సురేంద్ర కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




