Tuesday, March 3, 2026

 కేటిఆర్ కు కౌంటర్ ఇచ్చిన ఎంపి  చామల కిరణ్ రెడ్డి

- Advertisement -

 కేటిఆర్ కు కౌంటర్ ఇచ్చిన ఎంపి  చామల కిరణ్ రెడ్డి
హైదరాబాద్

MP Chamala Kiran Reddy counters KTR
పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకం అంతా పచ్చగా ఉన్నట్లు కేటీఆర్ వ్యవహారం ఉంది. బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్నారని భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
మీ నాయన,నువ్వు దోచుకున్నట్లు ఎవరు సీఎం కూర్చీలో కూర్చున్నా దోచుకుంటారని కేటీఆర్ భావిస్తున్నారు. బిఆర్ఎస్ పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత అంశాలపై రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారు. బిఆర్ఎస్ పార్టీకి సంస్థా లేదు గతం లేదు ఉన్నది ఐదుగురు మాత్రమే. పదేళ్ల పాలనలో ఈ ఐదుగురు ర్రాష్టాన్ని దోచుకున్నారని అన్నారు.
మా కాంగ్రెస్ పార్టీలో అందరూ నాయకులే. బిఆర్ఎస్ పార్టీకి కుటుంబ పాలన తప్ప ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జిల్లా అధ్యక్షులకు శిక్షణా తరగతులు లాంటి కార్యక్రమాలు డిక్షనరీలో లేవు. రాహుల్ గాంధీపై చిల్లర విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ ఎన్నడైనా సెక్రటేరియట్ కు వచ్చారా. ప్రగతి భవన్ లో ప్రగతి లేని పాలన ప్రజలకు అందించారు. సెక్రటేరియట్ ను కూలగొట్టి ఎక్కడ ఏ మంత్రి కూర్చున్నారో తెలియకుండా పాలన చేస్తున్నారు. ఇప్పుడు బామ్మర్ది వచ్చారు సాయంత్రానికి బావ వస్తారు. మధ్యలో బండి సంజయ్ రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారు. హైడ్రా వలన జరిగిన మంచి గురించి చర్చిద్దామా…? బండి సంజయ్ అని అన్నారు.
బండి సంజయ్ బిఆర్ఎస్ ట్రాప్ లో పడవద్దు. డ్రామారావు మాటలు బండి సంజయ్ పట్టించుకోవద్దు. బండి సంజయ్ కేంద్ర మంత్రి రాష్ట్రానికి ఏం చేయాలో ప్లాన్ చేయండి. రోజు పేపర్లు,టీవీల్లో ఉండాలని బండి సంజయ్ మాట్లాడుతున్నారు. బిఆర్ఎస్ చదివిన స్క్రిప్ట్ ను బండి సంజయ్ మాట్లాడుతున్నారు. బండి సంజయ్ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాలి. గుజరాత్ లో సబర్మతి రివర్ అభివృద్ధికి బీజేపీ సీఎం నరేంద్ర మోడీకి కాంగ్రెస్ సహకరించింది. అప్పటి అహ్మదాబాద్ నగర మేయర్ ఇమ్మత్ సింగ్ పటేల్, సీఎం నరేంద్రమోదీ కలిసి సబర్మతి రివర్ అభివృద్ధికి శంఖుస్థాపన చేశారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మూసీ ప్రక్షాళనకు బీజేపీ అడ్డం పడుతోంది. కిషన్ రెడ్డి,బండి సంజయ్,రామచంద్రరావు అడ్డుకుంటున్నారు. బిఆర్ఎస్ పదేళ్లు దోచుకుంటే బీజేపీ సైలెంట్ గా ఉంది. బిఆర్ఎస్,బీజేపీ ఒకరికి ఒకరు వకాలత్ తీసుకున్నారని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్