- Advertisement -
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తో ఎంపి ఈటల భేటీ
డిల్లీ.
నితిన్ గడ్కారీ కలిసి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం, తెలంగాణలో ఉన్న సమస్యలను ఎంపీ ఈటల రాజేందర్ వివరించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ కొంపల్లి ఫ్లై ఓవర్లు అండర్ పాస్, నత్తనడక నడుస్తున్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, శామీర్ పేట రోడ్డు, ఎల్బీ నగర్ అండర్ పాస్, హుజూరాబాద్ రోడ్డు సమస్యలపై చర్చించాము. హైదరాబాద్ లో నిర్మించేవి అన్నీ అండర్ పాస్ లు కాకుండా ఫ్లై ఓవర్ లు నిర్మించాలని కోరాము. హుజూరాబాద్ లో సింగాపూర్, రాంపూర్, రంగాపూర్, పెద్దపాపాయపల్లిలో రైతులకు ఇబ్బంది లేకుండా సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయాలని కోరాం. సమగ్రంగా మరో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు.
- Advertisement -