- Advertisement -
వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజల్లో ఎంపీ గడ్డం వంశీ కృష్ణ
MP Gaddam Vamsi Krishna in special worship of Vaikuntha Ekadashi
పెద్దపల్లి
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న ఎంపీ ప్రజల శ్రేయస్సు, పాడి పంటల సమృద్ధి, సుఖ సంతోషాల కోసం ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఎంపీ శాలువాతో సత్కరించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పెద్దపల్లి ప్రజల ఆధ్యాత్మిక జీవనంలో ముఖ్యమైనదిగా వెలుగొందుతున్నాదన్నారు. ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తన ఎంపీ లాడ్స్ నిధులను వినియోగిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
- Advertisement -