యూసఫ్‌గూడ బస్తీలో ఎంపీ వద్దిరాజు ప్రచారం

- Advertisement -

ఎంపీ వద్దిరాజు శనివారం యూసఫ్‌గూడ బస్తీలో ప్రచారం

MP Vaddiraju campaigns in Yusufguda Basti

హైదరాబాద్‌:
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హయాంలో విద్యుత్‌, తాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బంది ఉండేదిగా గుర్తుచేసుకుంటూ, ప్రస్తుతం కోతలు తప్పడం లేదని స్థానికులు వాపోయారు.

బీఆర్ఎస్‌ పార్లమెంటరీ పార్టీ ఉపనేత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శనివారం యూసఫ్‌గూడ బస్తీలోని పలు అపార్ట్‌మెంట్లను సందర్శించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గృహిణులు, వాచ్‌మెన్లతో మాట్లాడారు. ప్రజలు కేసీఆర్‌ పాలనలో విద్యుత్‌ అంతరాయం లేకుండా సరఫరా జరిగిందని, నల్లాల ద్వారా ప్రతిరోజూ తాగునీరు సమృద్ధిగా వచ్చేదని, ఇప్పుడు ఆ సౌకర్యాలు కరువైపోయాయని పేర్కొన్నారు.

ఇందుకు ఎంపీ రవిచంద్ర స్పందిస్తూ, “జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్‌ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారు. ఆయన కృషితో సుమారు 3,000 మంది పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు లభించాయి. గోపీనాథ్‌ అకాల మరణంతోనే ఈ ఉపఎన్నిక వచ్చింది. ఆయన సతీమణి సునీత గోపీనాథ్‌ బీఆర్ఎస్‌ తరఫున పోటీ చేస్తున్నారు. కారు గుర్తుకు ఓటు వేసి ఆమెను గెలిపించండి” అని పిలుపునిచ్చారు.

ప్రచారంలో స్థానిక మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని సానుకూలంగా స్పందించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular