ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి సంఘీభావం
MP Vaddiraju expresses solidarity with BRS Working President KTR

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆయన్ను కలిసి తన సంఘీభావం తెలిపారు.ఫార్ములా ఈ- కార్ రేసింగ్ నిర్వహణ,ఒప్పందంలో అవినీతి చోటు చేసుకుందన్న నిందారోపణలతో మాజీ మంత్రి కే.టీ.రామారావుపై ఏసీబీ కేసు బనాయించి నోటీసులు పంపడం తెలిసిందే.ఈ సందర్భంగా సోమవారం ఉదయం విచారణకు హాజరయ్యేందుకు గాను ఏసీబీ డైరెక్టర్ కార్యాలయానికి కేటీఆర్ బయలుదేరడానికి ముందు నందినగర్ లోని నివాసంలో ఎంపీ రవిచంద్ర ఆయన్ను కలిసి తన సంఘీభావం ప్రకటించారు.ఆ తర్వాత తెలంగాణ భవన్ లో కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతున్న సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుతో కలిసి ఎంపీ వద్దిరాజు పాల్గొన్నారు.